చింతపల్లి మండల కేంద్రంలో ఏసీబీ దాడులు

పశువైద్యాధికారి జి జే పాల్ 6000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు

చింతపల్లి మండల కేంద్రంలో ఏసీబీ దాడులు

జయభేరి, చింతపల్లి :
చింతపల్లి మండల కేంద్రంలో పశువైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న జి జే పాల్  6000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

బర్ల కొరకు బ్యాంకు లోన్ పదిలక్షల , హెల్త్ సర్టిఫికెట్ కోసం నసర్లపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద నుంచి 8 వేల రూపాయల లంచం డిమాండ్ చేయగా, 6000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని ఆ లంచం డబ్బులు పశు వైద్యాధికారి జిజే పాల్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు నేడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. 
ఈ రైడ్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎసిబి డిఎస్పీ జగదీశ్ చంద్ర, ఇన్స్పెక్టర్లు వెంకట్రావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Read More జి ఎన్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం