ఆటోను వెనుక నుంచి ఢీకొన్న లగేజీ వ్యాన్

ఎదురుగా ఐస్ క్యూబ్స్ లోడుతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి మామిడికాయల లోడుతో వస్తున్న లగేజీ వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటతోపాటు వ్యాన్ రోడ్డుపై బోల్తా పడగా.. ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఆటోను వెనుక నుంచి ఢీకొన్న లగేజీ వ్యాన్

జయభేరి, శ్రీకాకుళం :
నందిగాం మండలం బాణాపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

ఎదురుగా ఐస్ క్యూబ్స్ లోడుతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి మామిడికాయల లోడుతో వస్తున్న లగేజీ వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటతోపాటు వ్యాన్ రోడ్డుపై బోల్తా పడగా.. ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

Read More ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు

Views: 0

Related Posts