ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు

అమరావతీ: ఆంధ్రప్రదేశ్ లో అల్పపీడన ప్రభావం తో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 

ఇవాళ శ్రీకాకుళం, పార్వతీ పురం మన్యం జిల్లా, అల్లూరి, వైజాగ్, అనకాపల్లి, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Read More హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం... శిక్షర్హం... పట్టణ ఎస్సై రజాక్... ట్రాఫిక్ ఎస్ఐ కే సుధాకర్...