DGP : ఏపీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం..
వెంటనే బదిలీ చేయాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయనను తక్షణమే తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు అప్పగించవద్దని సూచించారు. కింది స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఆదేశించింది.
ఏపీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు, పోలీసు వ్యవస్థ వైసీపీ చేతుల్లో ఉందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో.. ఈసీ ఈ ఉత్తర్వులు జారీ చేయడం.. విపక్షాలకు బలం చేకూర్చినట్లే. ఖచ్చితమైన ఆధారాలు ఉంటే మాత్రమే, EC అటువంటి ఆదేశాలను జారీ చేస్తుంది.
ఎన్నికలు మరో 2 వారాల్లో ఉండగా.. రాష్ట్ర డీజీపీని బదిలీ చేయడం అంటే చిన్న విషయం కాదు. అందుకే ఇప్పుడు ఈ విషయం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి కొత్త డీజీపీ ఎవరు వస్తారన్నది సోమవారం తేలిపోయే అవకాశం ఉంది. ఇప్ప టికే రాజేంద్ర నాథ్ రెడ్డిని తక్షణం రిలీవ్ చేయాలని.. ఏపీలో ఇక డీజీపీ లేనట్లే. కొత్త డీజీపీ ఎవరు వచ్చినా శాంతి భద్రతల నడుమ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
Post Comment