AP SSC : టెన్త్ క్లాస్ లో 89 శాతం ఉత్తీర్ణత

ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు...

  • ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లోనూ ఫలితాలు చూసుకోవచ్చు. ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో మొత్తం 5,34,574 (86.69 %) విద్యార్థలు అర్హత సాధించారు.

AP SSC : టెన్త్ క్లాస్ లో 89 శాతం ఉత్తీర్ణత

విజయవాడ, ఏప్రిల్ 22
ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. దీంతోపాటు ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లోనూ ఫలితాలు చూసుకోవచ్చు. ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో మొత్తం 5,34,574 (86.69 %) విద్యార్థలు అర్హత సాధించారు.

ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. పాసైనవారిలో 89.17 శాతం బాలికలు, 84.32 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 96.37 శాతంతో మొదటి స్థానంలో నిలవగా.. 62.47 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. ఫలితాల్లో 69.26 శాతం ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. 11.87 శాతం సెకండ్ క్లాస్ లో పాసయ్యారు. 5.66 శాతం మూడో క్లాస్ లో ఉత్తీర్ణత సాధించారు. ఇక హిందీ మీడియంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 12 మంది ఎగ్జామ్ రాయగా, అందరూ పాసయ్యారు.ఈ ఏడాది ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.  6.16 లక్షలు రెగ్యులర్ విద్యార్థులు, లక్షకుపైగా గతేడాది ఫెయిలై రీ ఎన్‌రోల్ అయిన విద్యార్ధులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3743 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు.

Read More అన్నను హతమార్చిన తమ్ముడు

➥ రెసిడెన్షియల్ 98.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
➥ ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూళ్లలో 98. 40 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
➥ ఏపీ మోడల్ స్కూళ్లలో 92.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
➥ సోషల్ వెల్ఫేర్ 98.45 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
➥ ఆశ్రమ స్కూళ్లు 90.10 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
➥ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లు 89.46 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Read More ఖేల్ ఖుద్ పోగ్రామ్ (అటాలపోటీ) ఏకల్ అభియాన్ ద్వారా భోవనేశ్వ (ఒడిస్సా)కి బయలుదేరిన క్రీడాకారులు