Sobhita : కాల్ గర్ల్ గా మారిన తెలుగు హీరోయిన్..
చాలా సంతృప్తిగా ఉందని బ్యూటీ ఓపెన్ చేసింది
నేటి తెలుగు హీరోయిన్లు తమ గ్లామర్ తలుపులు తెరవడమే కాకుండా ఓపెన్ గా మాట్లాడటం అలవాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ తెలుగు అమ్మాయి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈమధ్య తెలుగు హీరోయిన్లు వెండితెరపై తమ సత్తా చాటడం మనం చూస్తూనే ఉన్నాం.

బాలీవుడ్ లో రాణిస్తూనే తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది శోభిత. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పటికే బి-టౌన్ జనాలను ఆకట్టుకున్న శోభిత టాలీవుడ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. పాత్రపై నమ్మకంతో అందంగా కనిపించింది. తాజాగా శోభిత ధూళిపాళ్ల ఓ సినిమాలో వేశ్య పాత్రలో కనిపించి షాక్ ఇచ్చింది. తాజాగా దీనిపై ఆమె స్పందిస్తూ.. కాల్ గర్ల్ గా నటించడంపై తన భావాలను వ్యక్తం చేసింది. హాలీవుడ్ చిత్రం మంకీ మ్యాన్‌లో శోభిత వేశ్య పాత్రలో నటించింది. ఏప్రిల్ 5న యూఎస్ లో విడుదలైన ఈ సినిమా.. ఈ నెల 26న ఇండియాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంకీ మ్యాన్‌లో సీత అనే వేశ్య పాత్రలో నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని శోభిత అన్నారు. ఈ సినిమాలో తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది. ఈ పాత్రను యూఎస్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారని, మన ప్రేక్షకులు కూడా తన పాత్రను ఆదరిస్తారనే నమ్మకం ఉందని శోభిత ధూళిపాళ్ల వేశ్య పాత్ర గురించి బహిరంగంగా చెప్పింది.

దీంతో అమ్మడి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శోభిత తెలుగు అమ్మాయి కావడం, గూడచారి సినిమా హిట్ కావడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. శోభిత ధూళిపాళ్ల సెలెక్టెడ్ చిత్రాలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా శోభిత ట్రెండ్ అవుతోంది. తన గ్లామర్ లుక్స్ తో యూత్ ఆడియన్స్ ని ఫిదా చేస్తోంది.


