Hyd : హైదరాబాద్‌లో అక్షయ్‌కుమార్..
కన్నప్ప టీమ్ క్రేజీ అప్‌డేట్
టాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మంచు విష్ణు టీమ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. కన్నప్ప చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్ కుమార్, శివరాజ్ కుమార్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవాసి ఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే సిద్ధం చేస్తున్నారు. ఈసారి పాన్ ఇండియా మార్కెట్‌లో తమ స్టామినా ఏంటో చూపించాలనే పట్టుదలతో విష్ణు టీమ్ ఉన్నట్లు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్షయ్ కుమార్ టాలీవుడ్ ఎంట్రీ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Post Comment