surekha second marriage : మా అమ్మకు అలాంటి అంకుల్స్ కావాలి
సుప్రీత తన తల్లి సురేఖావాణిని రెండో పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది.
సురేఖావాణి... పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. నటిగా సురేఖావాణికి మంచి గుర్తింపు ఉంది. ఆమె చాలా సినిమాల్లో తల్లిగా, అక్కగా, వదినగా విభిన్న పాత్రల్లో కనిపించింది. సురేఖావాణి వెండితెరపై కనిపించి చాలా రోజులైంది. సినిమాల్లో రాని గుర్తింపును సోషల్ మీడియా ఆమెకు ఇచ్చిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో సురేఖావాణిని ఫాలో అవుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉందంటే అమ్మడి రేంజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. సురేఖావాణికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సురేఖావాణి అందాలు ఆరబోయడం కుర్ర హీరోయిన్లతో సమానంగా ఉంది. వయసుకు తగ్గ అందంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. అందంలో కూతురు సుప్రీతతో పోటీ పడుతూ హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

సురేఖావాణి కూతురు సుప్రీత ఇటీవలే హీరోయిన్‌గా మారింది. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ నటిస్తున్న కొత్త సినిమాలో సుప్రీత హీరోయిన్ గా నటిస్తోంది. మాగంటి బాబు పార్టీ మారుతున్నాడా? తేల్చేసిన మాజీ ఎంపీ..! ఇదిలా ఉండగా సురేఖావాణి భర్త అనారోగ్యంతో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. సురేఖావాణి రెండో పెళ్లికి సంబంధించి పలు వార్తలు వైరల్‌గా మారాయి. ప్రముఖ దర్శకుడిని సురేఖావాణి పెళ్లి చేసుకోబోతోందంటూ ఓ వార్త వైరల్‌గా మారింది. ఆమె పెళ్లిపై వచ్చిన పుకార్లకు చెక్ పెట్టారా? తాను ఎవరినీ పెళ్లి చేసుకోవడం లేదని సురేఖావాణి తెలిపింది. సుప్రీత తన తల్లి సురేఖావాణిని రెండో పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది.
తాజాగా ఓ షోకు హాజరైన సుప్రీత.. తన తల్లిని మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచనను బయటపెట్టింది. ఈ సమయంలో, తన తల్లిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు సిద్ధంగా లేరని సుప్రీత చెప్పింది. పెళ్లి అయిన తర్వాత తనను బాగా చూసుకోవాలని చెప్పింది. అలాంటి వ్యక్తి ఉంటే తన తల్లి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. గతంలో తాను ఓ అబ్బాయిని ప్రేమించానని, అయితే అతడు తనను చాలా హింసించాడని సుప్రీత తెలిపింది.
Post Comment