Gangs of Godavari : అయేషా ఖాన్ అందాలతో మోత మోగించేసింది...

హిందీ బిగ్ బాస్ బ్యూటీ అయేషా ఖాన్‌తో కలిసి విశ్వక్ సేన్ డ్యాన్స్ చేశాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుండి విడుదలైన మోటా సాంగ్ అద్భుతంగా ఉంది.

Gangs of Godavari : అయేషా ఖాన్ అందాలతో మోత మోగించేసింది...

మాస్ క దాస్ విశ్వ‌క్ సేన్ ఇటీవ‌ల గామి సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. రీసెంట్ గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి అభిమానులకు మాస్ ఫీస్ట్ ఇచ్చాడు విశ్వక్. తాజాగా ఈ చిత్రంలోని మాస్ మసాలా సాంగ్ ఒకటి ఈరోజు విడుదలైంది. ఇందులో హిందీ బిగ్ బాస్ బ్యూటీ అయేషా ఖాన్ తన అందాలతో మోత మోగించింది.

మే 17న విడుదల కానున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.ఈ చిత్రంలోని 'సుత్తంలా సూసి' పాటకు ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట యూట్యూబ్‌లో దాదాపు 50 మిలియన్ల వ్యూస్‌ను కూడా పొందింది. తాజాగా మోట మోగిపొద్ది అనే మరో పాటను విడుదల చేశారు. యువన్ శంకర్ రాజా తనదైన శైలిలో మాస్ ప్లీజింగ్ బీట్‌తో పాటను కంపోజ్ చేశారు. చంద్రబోస్ రాసిన లిరిక్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆయేషా ఖాన్‌తో కలిసి ఎంఎం మానసి పాడిన ఈ పాటను విశ్వక్ సేన్ షేక్ చేశాడు. ముఖ్యంగా తన అందాలతో ఆకట్టుకున్న అయేషా. అయేషా ఖాన్‌కు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ మరియు ఎనర్జీ ఉంది. తాజాగా ఓం భీమ్ బుష్ సినిమాలో అయేషా ఖాన్ అందాల అభినయం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ పాటతో ఇప్పుడు ఈ బ్యూటీ గ్లామర్ డోస్ పెంచేసింది.

Read More Nayani Pavani : మనసేమో ఆగదు.. క్షణం కూడా! బిగ్ బాస్ బ్యూటీ మిస్ అయింది

హోలీ సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి కూడా కీలక పాత్ర పోషిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Read More Tamannah : అతనితో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తా.. తమన్నా షాకింగ్ కామెంట్స్!

Social Links

Related Posts

Post Comment