యువత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చాక కాకుండా ముందు నుండే సిద్ధంగా ఉండాలి...

గత సంవత్సరం పోలీస్ నోటిఫికేషన్ లో ఏఆర్, సివిల్, టి ఎస్ ఎస్ పి లో సుమారు 100 మంది ఉద్యోగం సాధించారు. వీరు రానున్న రోజుల్లో ఎస్సై ఉద్యోగం సాధించే దిశగా కృషి చేయాలి...

యువత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చాక కాకుండా ముందు నుండే సిద్ధంగా ఉండాలి...

జయభేరి, మేడిపల్లి: యువత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవ్వడం కాకుండా ముందు నుండే సిద్ధం ఉండాలి అని రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు.

బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని చెంగిచెర్ల శాంతివనం పార్కులో పోలీసు ఉద్యోగాలు సాధించిన సుమారు 30 మంది విద్యార్థులను, రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న సభ్యులను రాచకొండ రన్నర్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా రాచకొండ రన్నర్ అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ... గత సంవత్సరం పోలీస్ నోటిఫికేషన్ లో ఏఆర్, సివిల్, టి ఎస్ ఎస్ పి లో సుమారు 100 మంది ఉద్యోగం సాధించారు. వీరు రానున్న రోజుల్లో ఎస్సై ఉద్యోగం సాధించే దిశగా కృషి చేయాలి దానికి రాచకొండ రన్నర్స్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

Read More Telangana I కనించని కుట్రలో తెలంగాణ పాటమ్మ

మనము ఏదైతే సాధించాలి అనుకుంటామో దాన్ని పట్టుదలతో ఒక క్రమ పద్ధతిలో ప్రిపేర్ అయితే ఉద్యోగం తప్పక సాధించవచ్చు అని తెలిపారు. ఎలాంటి ఫీస్ లేకుండా ఫ్రీగా కోచింగ్ ఇస్తున్న రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ కు ఉద్యోగం సాధించిన విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు నాగార్జున రెడ్డి, కృష్ణయ్య, ఓయూ జేఏసీ నాయకులు కట్ట శేఖర్, రాచకొండ రన్నర్ సభ్యులు పాల్గొన్నారు.

Read More Telangana MP I టార్గెట్ @17

Views: 0