ఆలయాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాం...

వేద పాఠశాలలు ఏర్పాటు చేస్తాం... గత ప్రభుత్వంలో ఆలయాలను గుర్తించని వైనం... గజ్వేల్ మార్కెట్ పాలకమండలి ప్రమాణ స్వీకారానికి హాజరవుతా... దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

ఆలయాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాం...

జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్ 25: గజ్వేల్, పుణ్యక్షేత్రాల్లో భక్తుల సౌకర్యాలు కల్పనకు పెద్దపీట వేస్తుండగా, తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్ట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

బుధవారం సిద్దిపేట జిల్లా కొడకండ్ల శివారులో గజ్వేల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలోని ఆలయాలను ఆధ్యాత్మిక, పర్యాటక  కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నట్లు స్పష్టం చేశారు.

Read More మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు

ముఖ్యంగా యాదగిరిగుట్ట వద్ద భక్తులకు మెరుగైన వసతులు కల్పించే క్రమంలో 200 గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండగా, కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో రాయగిరి వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో, రూ 43 కోట్ల వ్యయంతో వేద పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Read More రేవంత్ రెడ్డి కి ఓటు వేసి తప్పు చేశాం అంటున్న ప్రజలు....

అలాగే కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తల శ్రమను గుర్తిస్తుండగా, వారికి నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించి ప్రోత్సహిoచనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని,గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ పాలక మండలి సన్మాన మహోత్సవానికి హాజరు కానున్నట్లు ఆమె వివరించారు.

Read More గాంధీభవన్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి 

ఈ కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జిలు హరికృష్ణ,  శ్రీనివాస్ రెడ్డి, ఆయా మండలాల కాంగ్రెస్ బాధ్యులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, న్యాయవాది సాజిద్ బేగ్, నాయకులు మహేందర్ రెడ్డి, సురేష్, యాదగిరి, రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read More కేసీఆర్ గారు మిరెక్కడా...?