తుంకుంట మున్సిపల్ పరిధిలో వన మహోత్సవం 

పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మొక్కలు నాటాలని పిలుపు

తుంకుంట మున్సిపల్ పరిధిలో వన మహోత్సవం 

జయభేరి, జులై 16: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తుంకుంట మున్సిపల్ కమిషనర్ ఆర్. వెంకట గోపాల్, మున్సిపల్ చైర్మన్ కారంగుల రాజేశ్వర్ రావు లు తెలిపారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా తుంకుంట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు పోతాయిపల్లి లోని ప్రభుత్వ పార్కులో మొక్కలు నాటారు.

అనంతరం వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా తుంకుంట మున్సిపల్ పరిధిలో 15 వ వార్డులో మొక్కలు నాటినట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రతీ ఇంటికి మొక్కలు పంపిణీ చేసినట్లు వారు వివరించారు. ప్రతీ ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని, మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు పాటు పడాలనీ సూచించారు.

Read More మెడిసిటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

నేటి నుంచి ప్రతీ రోజు మున్సిపల్ పరిధిలోని 16 వార్డులలో వన మహోత్సవం కార్యక్రమం చేపడతామని, ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనీ మొక్కలు నాటాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ తీగుళ్ల హరిబాబు, 11 వ వార్డు కౌన్సిలర్ నర్సింగరావు గౌడ్, కో ఆప్షన్ సభ్యులు మిర్జా షఫీ, ఉల్లా భేగ్, మున్సిపల్ మేనేజర్ శ్రవణ్ కుమార్. బిల్ కలెక్టర్లు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలి

WhatsApp Image 2024-07-16 at 11.01.28 PM

Read More వంద పడకల ఆసుపత్రి ప్రారంభానికి మోక్షం ఎప్పుడో ?

Latest News

ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి  ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
జయభేరి, దేవరకొండ :రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా...
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 
ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి