అమ్మో... ఎంత హడావిడి చేసిందో...

కడుపు ఉందని.... డ్రామా...

అమ్మో... ఎంత హడావిడి చేసిందో...

వరంగల్, సెప్టెంబర్ 13:
భారంగా నడుచుకుంటూ వైద్యుల వద్దకు వెళ్లి తనకు డెలివరీ చేయాలని కోరింది. పురిటి నొప్పులు వస్తున్నాయని హంగామా చేసింది. ఆ గర్భిణికి అవస్థ ఎక్కువగా ఉన్నదేమోనని వైద్యులంతా అలర్ట్ అయ్యారు. డెలివరీకి ఏర్పాట్లు చేశారు. సిబ్బంది కూడా సిద్ధమైంది. ఇంతలోనే తాను ఒకసారి వాష్‌రూం వెళ్లివస్తానని చెప్పి వెళ్లింది.

సెకన్ల వ్యవధిలోనే తిరిగి వస్తూనే వైద్యులపై దూషణలు మొదలు పెట్టింది. పిండం టాయిలెట్‌లో పడిపోయిందని, వైద్యులు పట్టించుకోకపోవడం వల్లే తన బిడ్డ దక్కకుండా పోయిందని వీరంగం సృష్టించింది. దీంతో డాక్టర్లంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అసలేం జరిగిందా? అని షాక్ అయ్యారు.పల్లవికి రెండేళ్ల క్రితం పెళ్లయింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నాగులగుంట గ్రామానికి చెందిన ఈమెకు రాగ్యతండాకు చెందిన సుమతన్‌తో వివాహం జరిగింది. పెళ్లయిప్పటి నుంచి పిల్లల కోసం అత్తింటివారు ఎదురుచూశారు. ఏడాది క్రితం నుంచి పిల్లలు ఇంకా కావడం లేదని పల్లవిపై నోరుపారేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో పల్లవి ఎవరూ ఊహించని డ్రామాకు శ్రీకారం చుట్టింది. ఎనిమిది నెలల క్రితం తాను గర్భం దాల్చినట్టు చెప్పింది. తన డ్రెస్‌లో బట్టలు జొప్పించుకుని గర్భం తరహా చూపించుకుంది.

Read More మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలం

కట్టుకున్న భర్త, అత్తింటివారిని సహా అందరినీ తాను గర్భవతిని అని నమ్మించింది. ఆ తర్వాత ఆశా వర్కర్లను కూడా ఆమె బోల్తా కొట్టించింది. నెలనెలా ఆస్పత్రికి కూడా చెకప్‌లో కోసం వెళ్లి వచ్చేది.రోజులు గడుస్తున్నాయి. నెలలు గడుస్తున్నాయి. ఆమె కూడా తన పొట్ట సైజును పెంచేలా బట్టలు ఎక్కువ అమర్చుకోవడం చేసింది. తీరా ఈ డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టే రోజు రానేవచ్చింది. తనకు పురిటినొప్పులు వస్తున్నాయని ఇంట చెప్పింది. జనగామా జిల్లాలోని మాతా శిశు హాస్పిటల్‌కు పల్లవిని తీసుకుని వచ్చారు. తనకు పురిటి నొప్పులు వస్తున్నాయని, వెంటనే డెలివరీ చేయాలని ఆమె కోరింది. ఆమెకు నార్మల్ డెలివరీ చేస్తామని వైద్య సిబ్బంది చెప్పారు. దీంతో ఆమె తాను ఒకసారి వాష్ రూమ్ వెళ్లి వస్తానని చెప్పింది.

Read More నిత్యవసర వస్తువులుకు ధరలకు రెక్కలు

ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే అరుస్తూ.. వైద్యులను తిడుతూ తిరిగి వచ్చింది.తన గర్భం పోయిందని, డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే పిండం కిందపడిపోయిందని పల్లవి ఆరోపణలు చేస్తూ అరిచింది. ఆమె అరుపులతో వైద్య సిబ్బంది కొన్ని క్షణాలపాటు ఏమీ అర్థంకాక నివ్వెరపోయారు. తేరుకుని వాష్ రూం వద్దకు పిండం చూడటానికి వెళ్లారు. అంతే వారంతా షాక్ అయ్యారు. వాష్ రూంలో పిండంకు బదులు బట్టలు ఉన్నాయి. కాగా, విషయం తెలియక కొందరు ట్రీట్ మెంట్ కోసం సిబ్బంది పల్లవిని పరీక్షించినప్పుడు.. అసలు ఆమె గర్భవతే కాలేదని తెలుసుకున్నారు. ఈ విషయంపై పల్లవిని నిలదీయగా.. తిరిగి వారిపై గొడవకు దిగింది. దీంతో వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Read More మోటార్ సైకిల్ దొంగలించిన నిందితుడు అరెస్టు 

పిల్లలు కావట్లేదని అత్తింటివారు తిడుతున్నారని, అందుకే గర్భవతి డ్రామా ఆడాల్సి వచ్చిందని పల్లవి పోలీసు విచారణలో అంగీకరించింది. కొన్ని బట్టలను అమర్చుకుని గర్భం తరహా చూపించిందని, రెండు చీరలను పొట్టపై అమర్చుకుని హాస్పిటల్ వచ్చినట్టు తేలింది.ఎట్టకేలకు అసలు విషయం బయటపడింది. కానీ, ఈ ఎనిమిది నెలలు ఆమె భర్తను, అత్తింటివారిని, గ్రామస్తులను, చివరికి గ్రామంలోని ఆశా వర్కర్లను ఎలా నమ్మించిందా? నెలానెలా హాస్పిటల్‌లో చెకప్ సమయంలోనూ వైద్యుల కంటి నుంచి ఎలా తప్పించుకుందా? అనేది అర్థంకాక వారు తలలు గోక్కుంటున్నారు. పల్లవి మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించి పోలీసులు, వైద్యులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

Read More గాంధీభవన్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి