పదవి విరమణ పొందిన ఆర్టీసీ డిఎం రాజీవ్ ప్రేమ్ కుమార్ కి ఘనంగా సన్మానం
అసిస్టెంట్ మేనేజర్ సైదులు మాట్లాడుతూ... రాజీవ్ ప్రేమ్ కుమార్ గత 32 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు ఆర్టీసీలో వివిధ హోదాలలో పనిచేసి, ఉన్నత అధికారుల మన్ననలు పొంది, ఆర్టీసీ ఎండి సజ్జనర్ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ఉత్తమ డిఎంగా అవార్డు పొంది అద్భుతమైన సేవలందించారని కొనియాడారు.
జయభేరి, దేవరకొండ :
ఆర్టీసీ డిపోలో డిఎంగా విధులు నిర్వహించిన రాజీవ్ ప్రేమ్ కుమార్ శుక్రవారం పదవీ విరమణ పొందారు.

పదవీ విరమణ అనంతరం జీవితాన్ని కుటుంబ సభ్యుల మధ్య ఉల్లాసంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారిని గజమాలతో, శాలువలతో సత్కరించి ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో వీడ్కోలు పలికారు. వారి శేష జీవితం సుఖమయంగా ఉండాలని కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో డిఎం రాజీవ్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. పదవీ విరమణ ప్రతి ఉద్యోగునికి తప్పనిసరని, తన పదవీ కాలంలో చేసిన సేవలు చిరకాలం గుర్తుంటాయన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసి గౌరవ ప్రదంగా పదవీ విరమణ పొందడం అదృష్టమని అన్నారు.
అనంతరం తోటి ఉద్యోగులు పూలమాలవేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డిపో మేనేజర్ బి.పాల్, ఆర్ఆర్ రావు,రాములు నాయక్, ఆర్ఎస్ రావు, రాజేందర్, యాదయ్య, Md ఉస్మాన్ ఉప్పల శ్రీనివాస్ (చంటి), సమద్, కోటియా నాయక్, పాండురంగా చారి రామ్ కోటి, డిపో సిబ్బంది, డ్రైవర్లు,కండక్టర్లు ప్రైవేటు బస్సుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


