విద్యార్థులకు భోజనం ప్లేట్లు, గ్లాసులు అందజేసిన తిరుపతి రెడ్డి
గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో పాటు అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులు, ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనం తినేందుకు 400 మంది విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు గ్రామ మాజీ సర్పంచ్ బాబు యాదవ్, తన మిత్రుడు యాటవెళ్లి మహిపాల్ రెడ్డి తో కలిసి అందజేశారు. త్వరలో వారికి షూలు కూడా అందజేయనున్నట్లు తెలిపారు.
జయభేరి, మేడ్చల్ :
విద్యార్థులు కష్టపడి చదివి గ్రామానికి, తల్లిదండ్రులకు గొప్పపేరు తీసుకురావాలని పూడూరు గ్రామానికి చెందిన ఎన్నారై మజ్జిగ తిరుపతి రెడ్డి అన్నారు. శనివారం పుడూరు గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు ఉచితంగా అందజేశారు.
విద్యార్థులు బాగా చదివి మంచి స్థానాల్లో నిలవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు శశికుమార్ యాదవ్,శ్రీకాంత్, న్యాయవాది దుందిగల్ల మహేందర్, నాయకులు గోపాల్ యాదవ్ , వెంకట్రాంరెడ్డి, చెన్నాయాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


