పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ను గెలిపించాలి
తీన్మార్ మల్లన్నకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి. రాజ్యాంగాన్ని నాశనం చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని, రాజ్యాంగాన్ని నాశనం చేసి గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కోరుకుంటుంది అని ఆరోపించారు.
జయభేరి, దేవరకొండ :
దేవరకొండ పట్టణ కేంద్రంలోని పి పి ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన వరంగల్, ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్ధి తీన్మార్ మల్లన్నతో పాటు దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సభను ఉద్ధేశించి మాట్లాడిన దేవరకొండ ఎమ్మెల్యే.. తీన్మార్ మల్లన్నకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి. రాజ్యాంగాన్ని నాశనం చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని, రాజ్యాంగాన్ని నాశనం చేసి గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కోరుకుంటుంది అని ఆరోపించారు. బీజేపీ గెలిస్తే ప్రభుత్వ రంగాన్ని మొత్తం ప్రైవేటీకరించడం ఖాయంమని ఎమ్మెల్సీ ఉప ఎన్నికల అత్యంత కీలకమైనవని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వల్ల దళిత, గిరిజనులు, బలహీన వర్గాల హక్కులు, వారికి రావాల్సిన వాటా కూడా నష్టపోయే ప్రమాదం కనిపిస్తోందని అన్నారు.

దళిత, గిరిజన, బహుజనులకు దేశంలో అషామాషీగా రిజర్వేషన్లు రాలేదని, బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ నాయకులు అమలు చేయడం వల్లే రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని అన్నారు.దళిత, గిరిజన, బహుజనల్లో మార్పు అంటూ వచ్చిందంటే అది కేవలం రిజర్వేషన్ల వల్లనే అని,విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో అట్టడుగు వర్గాలకు అవకాశాలు దక్కింది అంటే రిజర్వేషన్ల వల్లనే అని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ మండలాల పరిధిలో ఉన్న ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.


