ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు
బండి సంజయ్
- వ్యవస్థను భ్రష్టు పట్టించిన, వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నరని ఆరోపించారు. గతంలో డ్రగ్స్, మియాపూర్ భూములు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ కేసును మూసివేసే కుట్ర జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ తతంగమంతా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది.
జయభేరి, హైదరాబాద్ :
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు... నేను ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్కక్కై ఎదురుదాడి చేస్తున్నయ్. గతంలో కేసీఆర్ మాదిరిగానే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారు. అతిపెద్ద ఉదాహరణ ఫోన్ ట్యాపింగ్ కేసు. వ్యవస్థను భ్రష్టు పట్టించిన, వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నరని ఆరోపించారు. గతంలో డ్రగ్స్, మియాపూర్ భూములు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ కేసును మూసివేసే కుట్ర జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ తతంగమంతా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ఇవన్నీ బయటకు రావడంతో కేసీఆర్ కుటుంబం కరీంనగర్ లోని ఓ మంత్రితో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నరు.
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ కు టిక్కెట్ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకర్ రావు. రాజేందర్ కు కాంగ్రెస్ కు సంబంధం లేదు.. ఆయన కార్యకర్త కానేకాదు... ఏనాడు ఉద్యమాల్లో పాల్గొనలేదు. అసెంబ్లీ ఎన్నికల నుండే రాజేందర్ రావును ప్రభాకర్ రావు తెర ముందుకు తీసుకొచ్చారు. కోట్ల రూపాయలు రాజేందర్ రావు ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధులకు డబ్బులు ఇప్పించారు. రాష్ట్ర వ్యవహారాలు చూసే కాంగ్రెస్ నేతలకు కూడా కోట్ల రూపాయలు ముట్టజెప్పించారు. కరీంనగర్ పార్లమెంట్ టిక్కెట్ వేరొకరు ఆశిస్తున్నప్పటికీ.. ఆయనకు సీఎంకు పూర్తి మద్దతు ఇచ్చినప్పటికీ ఈ తతంగం నడపడంవల్లే ఆయనకు టిక్కెట్ రాలేదు. కాంగ్రెస్ నాయకత్వానికి ఈ విషయం తెలియదా? డబ్బులు ముట్టజెప్పారనే దీనిపై స్పందించడం లేదా? కేసీఆర్ ఆదేశం మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చిన తరువాత కూడా ఇప్పటి వరకు కేసీఆర్ పై చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.


