అధికారిగా సమాజంలో చేసిన సేవలు చిరస్మరణీయం

గుండ్లపోచంపల్లి కమిషనర్ రాములు పదవీ విరమణ కార్యక్రమంలో ఎంపీ ఈటల

అధికారిగా సమాజంలో చేసిన సేవలు చిరస్మరణీయం

జయభేరి, మేడ్చల్ :
పదవీ విరమణ ప్రతి ఉద్యోగికి తప్పనిసరని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. శనివారం గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ వేముల రాములు పదవి విరమణ అభినందన సభలో ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరై కమిషనర్ రాములు దంపతులను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ సమాజంలో అధికారిగా తన పదవీ కాలంలో చేసిన సేవలు చిరకాలం గుర్తుంటాయన్నారు. కమిషనర్ రాములు నిజాయితీ గల అధికారిగా గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు అవార్డులు అందుకున్నడాని ఎంపీ గుర్తు చేశారు. అధికారిగా రాములుకు ఉన్న అనుభవం, పరిజ్ఞానం సమాజానికి సంపూర్ణంగా ఉపయోగపడాలని ఆశిస్తున్నట్లు ఈటల పేర్కొన్నారు.

Read More నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి 

914e7050-9187-471b-a82e-822a79052391

Read More ఎమ్మెల్సీ రామచంద్రారావును సన్మానించిన మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు రజిత వెంకటేష్, అమరం జైపాల్ రెడ్డి, మల్లికార్జున్, హేమంత్ రెడ్డి, బాలరాజు, పెంటయ్య, హంసా రాణి, సరస్వతి, వీణ, సాయిపేట శ్రీనివాస్, రాజకుమారి, అంథోనమ్మ, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, భేరి ఈశ్వర్, బిజెపి జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More ఈవీఎంలపై సమగ్ర స్వతంత్ర పరిశీలన జరగాలి

Views: 0

Related Posts