భారత రత్న,భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి

కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ

భారత రత్న,భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి

జయభేరి, మేడ్చల్ :

భారత రత్న, భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం మేడ్చల్ జిల్లా కేంద్రంలోని మేడ్చల్ పట్టణంలో మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ప్రక్కన గల కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మె వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. *ఈ కార్యక్రమంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ.

Read More వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి

ఈ సందర్బంగా కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ...  అతి పిన్న వయస్సు లో భారత దేశ ప్రధాన మంత్రిగా పని చేసారని, భారత దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని మొదటగా దేశంలో అమలు పర్చిన ఘనత రాజీవ్ గాంధీది అని అన్నారు.

Read More ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్స్ నడికొప్పు నాగరాజు ముదిరాజ్(చాపరాజు), కౌడే మహేష్ కురుమ, మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉదండపురం సత్యనారాయణ, NSUI నాయకులు లవంగు రాకేష్ వంజరి, గుండ శ్రీధర్ కురుమ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామన్నగారి సంతోష్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, శ్యాంరావు, వరదా రెడ్డి, రంజిత్, వరున్, విజయేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్

Views: 0