భారీగా డెంగ్యూ కేసులు.. వైద్యశాఖ పట్టించుకోవడంలేదు.. కేటీఆర్

భారీగా డెంగ్యూ కేసులు.. వైద్యశాఖ పట్టించుకోవడంలేదు.. కేటీఆర్

తెలంగాణలో ఒకే రోజు ఐదుగురు డెంగ్యూతో చనిపోయారని.. రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్‌ ఫైరయ్యారు. రాష్ట్రంలో భారీగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నప్పటికీ వైద్యశాఖ పర్యవేక్షించట్లేదని విమర్శించారు.

కేసుల పెరుగుదలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శాఖ వద్ద ప్రణాళికలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, డెంగ్యూపై అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యమంగా బ్లడ్‌ ప్లేట్‌లెట్స్‌ అందుబాటులో ఉంచాలని కేటీఆర్‌ సూచించారు. 

Read More గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల పట్ల మక్కువ చూపాలి - సీఐ శ్రీనాథ్

సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజాపాలనలో పూర్తిగా ప్రజారోగ్యం పడకేసిందని కేటీఆర్‌ మండిపడ్డారు. డెంగ్యూ సహా విజృంభిస్తున్న విష జ్వరాలతో జనం పరేషాన్ అవుతున్నారని, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల బెడద నివారించడంలో సర్కార్ ఫెయిల్ అయ్యిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. గాడితప్పుతున్న ప్రజారోగ్యంపై ముఖ్యమంత్రి సమీక్షలేవి?, ఢిల్లీకి 20 సార్లు వెళ్లే తీరికుంది కానీ.. ప్రజారోగ్యంపై పట్టింపు లేదా? అని కేటీఆర్‌ నిలదీశారు. 

Read More 6న పంచాయతీ ఓటర్ల ముసాయిదా జాబితా

చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణలో ఎందుకింత నిర్లక్ష్యం? ప్రజల ప్రాణలంటే అంతే లెక్కలేనితనమా? అని అడిగారు. వెంటనే విష జ్వరాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read More లక్ష్మాపూర్ లోని ఎల్లమ్మ దేవాలయంలో అర్థరాత్రి చోరి

Latest News

నిమజ్జన వేడుకల్లో భాగంగా లడ్డు వేలం పాట... ఘనంగా నిమజ్జన వేడుకలు నిమజ్జన వేడుకల్లో భాగంగా లడ్డు వేలం పాట... ఘనంగా నిమజ్జన వేడుకలు
జయభేరి, సెప్టెంబర్ 16:- మేడ్చల్ జిల్లా మురహరిపల్లి గ్రామంలో రవి యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నిమజ్జన వేడుకల్లో భాగంగా లడ్డు...
800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలిక
ఆది దేవుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి
చిరంజీవి ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు విరాళం
అరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం
టీపీసీసీ నూతన అధ్యక్ష బాధ్యతల స్వీకారోత్సవం కోసం గన్‌పార్క్ నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ