ప్రతిష్టాత్మకంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం
వర్గల్ మండల బిజెపి అధ్యక్షులు టేకులపల్లి బాల్ రెడ్డి
జయభేరి, గాజ్వెల్ : వర్గల్ మండలంలో బిజెపి సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు మండల శాఖ అధ్యక్షులు టేకులపల్లి బాల్రెడ్డి పేర్కొన్నారు.
Read More Telangana I రాజకీయాలు.. పోలీసులు...
యువత, మహిళలు, రైతులు, చిరు వ్యాపారులు, నిరుద్యోగుల నుండి మంచి స్పందన వస్తోందని తెలిపారు. ముఖ్యంగా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పంపరి రమేష్, తిరుపతిరెడ్డి, కుమ్మరి రమేష్, రవీందర్, కాయిత రాజు, డ్యాగ శ్రీకాంత్ తో పాటు ఆయా గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 0


