నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

జయభేరి, మేడ్చల్ : 

గుండ్లపోచంపల్లి సబ్ స్టేషన్ పరిదిలోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వెంకట్ గౌడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దులపల్లి 11కేవీ ఫిడర్ పైన చెట్లకొమ్మలను తొలగించుట,

Read More Telangana I తుంగతుర్తి గడ్డపై ఎగరబోయే జెండా..!?

మరమ్మతు పనుల కారణంగా ఉదయం 10:00 గం.ల నుండి మధ్యాహ్నం 1:30 గం.ల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడనుందని వినియోగదారులు సహకరించాలని ఏఈ తెలిపారు. విద్యుత్ నిలిపివేత ప్రభావిత ప్రాంతాలైన నాగేళ్లి మల్లారెడ్డి డిటిఆర్, గుండ్లపోచంపల్లి ప్రభుత్వ పాఠశాల, హనుమాన్ దేవాలయం, మహంకాళి కాలనీ, మున్సిపల్ కార్యాలయం, గుండ్లపోచంపల్లి పాత గ్రామం, గోల్డెన్ ప్లాజా, ఏప్సిలన్ విల్లాస్, భగవతి వెంచర్, ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని అలాగే 1కేవీ కండ్లకోయ ఫిడర్ మరమ్మతుల కారణంగా మధ్యాహ్నం 2.30 గం.ల నుండి సాయంత్రం 5.00 గం.ల వరకు సూతరిగుడా, రైల్వే ట్రక్ ఏరియా, రిలయన్స్ గోడౌన్స్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ పేర్కొన్నారు.

Read More Telangana 26th I భద్రతకు భరోసా ఏది!? 

Views: 0