ఏకగ్రీవంగా సాయి హిల్స్ కాలనీ అధ్యక్షునిగా యం మధుసూదన్,ప్రధాన కార్యదర్శి పి మోహన్ రెడ్డి

ముఖ్యఅతిథిగా పాల్గొన్న 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి

ఏకగ్రీవంగా సాయి హిల్స్ కాలనీ అధ్యక్షునిగా యం మధుసూదన్,ప్రధాన కార్యదర్శి పి మోహన్ రెడ్డి

జయభేరి, మేడిపల్లి : పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్లోని సాయి  హిల్స్ కాలనీ అశోషియేషన్ కార్యవర్గన్ని కాలనీ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా యం.మధుసూదన్ ని అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా పి. మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు.

అనంతరం పూర్తి స్థాయి కార్యవర్గాన్ని  ఎన్నుకున్నారు, ఉపాధ్యక్షులుగా రవి, కిరణ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వేణు, రాజీ రెడ్డి, శ్రవణ్ రెడ్డి కోశాధికారి హరినాథ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు భానుప్రకాష్ గౌడ్, సంయుక్త కార్యదర్శి శ్రవణ్ నియమించారు. ఈ యొక్క కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి గారు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులను, కమిటీ సభ్యులను,సలహాదారులను శాలువతో సన్మానించి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Read More Telangana I ఇది గౌడలను అవమానించడమే..!

గత కార్యవర్గ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి మధుసూదన్, మహేందర్, కార్యవర్గ కమిటీ సభ్యులను అభినందించి, వీడ్కోలు పలుకుతూ శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ...  తనపై నమ్మకంతో అధ్యక్షునిగా ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Read More Telangana I మును గో.. డౌట్..

Views: 0