ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు  

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు  

మేడ్చల్ :
గుండ్ల పోచంపల్లి ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు రవి మాదిగ ఆధ్వర్యంలో గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిచారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించి ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో అమరులైన అమరవీరులందరికీ సెల్యూట్ చేస్తూ నివాళులు అర్పించారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం గత 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పుడు కేవలం 6 మందితో కూడిన సభ్యులతో ఉంటూ నేడు లక్షలాది మందితో ఎమ్మార్పీఎస్ కృష్ణ మాదిగ నేతృత్వంలో ముందుకు సాగుతుందన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం కేవలం మాదిగలకే కాకుండా దేశంలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ముందుగా స్పందించే నాయకుడు మందకృష్ణ మాదిగ అని ఎమ్మార్పీఎస్ ఉద్యమం పేరుతో ఎన్నో ఉద్యమ పోరాటాలు చేస్తూ అందుకు అనుగుణంగా ఎన్నో ఫలితాలను సాధించడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు ప్రభుత్వమే చేయాలని సంకల్పంతో ఉద్యమించడంతో దానికి ఫలితంగా ఆరోగ్యశ్రీ అనే పథకం ఏర్పడిందాని గుర్తు చేశారు.

Read More Telangana 26th I భద్రతకు భరోసా ఏది!? 

ఆకలి కేకల పోరుయాత్ర పేరుతో ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం ఇవ్వాలని కృష్ణ మాదిగ పోరాట ఫలితంగా నేడు ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం చొప్పున వస్తున్నాయని, వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ లు పెంచాలని డిమాండ్ తో కృష్ణ మాదిగ అనేక సభలు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడంతో నేడు వారందరికీ పింఛన్ పెరిగిందని తెలిపారు. ఏబిసిడి ఎస్సి వర్గీకరణ జరిగితేనే మాదిగలకు, ఉపకుల అందరికీ న్యాయం జరుగుతుందని మందకృష్ణ సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే మందకృష్ణ మాదిగ 60వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నమని అన్నారు. మందకృష్ణ మాదిగ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుతున్నట్లు తెలిపారు.

Read More Telangana I మేయర్, కార్పోరేటర్లంతా రాజీనామా చేసి  ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి..

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కుండ భానుచందర్ మాదిగ,ఎమ్మార్పీఎస్ గుండ్లపోచంపల్లి అధ్యక్షులు రవి మాదిగ, ముక్కిడి గళ్ళ మహేష్, డప్పు నర్సింగరావు, డప్పు కృష్ణ,  జనార్ధన్, శ్రీనివాస్,వెంకటేష్, మల్లికార్జున్ మహేష్, సురేష్, చింటూ, సత్యనారాయణ, రాజు, బాలేష్, నవీన్, శ్రీకాంత్, జోగోల్ల సురేష్, నవీన్ చింటూ, ముక్కిడిగల చింటూ, తదితరులు పాల్గొన్నారు.

Read More School I శ్రీ చైతన్య పాఠశాలలొ వైజ్ఞానిక, సాంస్కృతిక,  క్రీడా ప్రదర్శన

Views: 0