Land : లోగుట్టు పెరుమాళ్ళకెరుక!

  • అక్రమ వెంచర్లపై అధికారుల అలసత్వం..
  • ప్రభుత్వ నిబంధనలు గాలికి..
  • వ్యాపారులకు ఆదాయం.. మున్సిపాలిటికి ఖర్చులు..

Land : లోగుట్టు పెరుమాళ్ళకెరుక!

జయభేరి, మేడ్చల్:
ప్రభుత్వ అనుమతులు లేకుండా నిభందనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్ పై మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు లోగుట్టు పెరుమాళ్ళకెరుక అనే చందంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.

అక్రమ లే అవుట్లను ఆదిలోనే అపాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పై అనేక అనుమానాలు తావిస్తోంది. సామాన్యుడు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తే చర్యలు తీసుకునే అధికారులు అక్రమ వెంచర్ల విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిదిలోని మైసమ్మగూడలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కొందరు వ్యవసాయ భూమిని చదును చేసి నాలుగు వైపులా నాలుగు హద్దురాళ్ళు పాతి ప్లాట్లుగా మలిచి జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారు. గతంలోనూ ఈ గ్రామంలోని పలు సర్వే నెంబర్లలో రియల్ వ్యాపారులు ఇదే తరహాలో వ్యవసాయ భూములను ప్లాట్లుగా మలిచి అమ్మకాలు జరిపి కోట్ల గడించారు. మైసమ్మగూడలో ఇంతలా అక్రమ వెంచర్ల ఏర్పాటు సాగుతున్న చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని వారి సహకారంతోనే ప్లాట్ల వ్యాపారం జరుగుతుందని, ఇందులోనే పెద్ద మొత్తంలో మామూళ్లు ముట్టాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read More ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

నిబంధనలు గాలికి
ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇష్టారీతిన వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. వెంచర్లు ఏర్పాటు చేసే స్థలంలో యజమానులు 30 ఫీట్ల వెడల్లు రోడ్లను నిర్మించాలి. రోడ్ల చివర్లో అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీలను నిర్మించాలి. కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్‌ కనెక్షన్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలి. ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకునే ప్రజలకు ఆహ్లాదం కోసం మున్సిపాలిటీ నిబంధనల మేరకు పార్కులను ఏర్పాటు చేయాలి. అందుకు సొంత ఖర్చులతో మొక్కలు నాటి అభివృద్ధి చేయాలి.

Read More ప్రతాప్ రెడ్డికి అందజేసిన నూతన క్యాలెండర్

దీని కోసం స్థానిక సంస్థలకు  10శాతం స్థలం వెంచర్‌ యజమానులు అప్పగించాలి. దీన్ని మున్సిపాటిటీలు పేర రిజిస్ట్రేషన్‌ చేయించాలి. ఈ ఏర్పాట్లు అన్ని చేశాక లే అవుట్‌ అనుమతులకు దరఖాస్తు చేయాలి. అధికారులు నిబంధనల మేరకు అభివృద్ధి జరిగిన పక్షంలో లే అవుట్‌ అనుమతులు మంజూరు చేస్తారు. అప్పుడు నిర్ణీత ఫీజును ప్రభుత్వానికి చెల్లించాలి.  ప్రస్తుతం ఏర్పాటవుతున్న వెంచర్లలో ఎక్కడ కూడా పై నిబంధనలు అమలు కావడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.   అధికారులు, పాలకులు నిబంధనలను గాలికి వదిలి రియల్‌ వ్యాపారులతో కుమ్మక్కయ్యారని, అందుకే వెంచర్ల జోలి కి పోవడంలేదని జోరుగా ప్రచారం జరుగుతోంది.  పలు అక్రమ వెంచర్లలో అమాయకులకు అడ్డగోలు ధరలకు ప్లాట్లను విక్రయించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

Read More వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

Loguttu 2

Read More కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం

వ్యాపారులకు ఆదాయం... మున్సిపాలిటీకి ఖర్చులు
మైసమ్మగూడలో అక్రమ లే అవుట్ల కారణంగా రియల్ వ్యాపారులకు రూ. కోట్ల ఆదాయం వస్తుండగా మున్సిపల్ కార్యాలయా ఆదాయానికి గండి పడటమే కాకుండా ఖర్చులు అవుతున్నాయి. వ్యాపారులు పంటపోలాలను ప్లాట్లుగా మార్చే సమయంలో కనీస వసతులైన డ్రైనేజీ, రోడ్లు, ఇతర వసతులు కల్పించకుండానే అమ్మకాలు జరిపి చేతులు దులుపుకోగా వాటిని కోనుగోలు చేసిన వారు సైతం అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.

Read More ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన  పద్మశాలి కులస్తులు

దీంతో ఆ భవనంలో హాస్టల్ మొదలైన తర్వాత వాటిలో ఉండే విద్యార్థులకు నీటి వసతి, డ్రైనేజీ, రోడ్ల సమస్య తలెత్తుతుంది. అక్రమ లే అవుట్లలో ఆదిలోనే ఆపాల్సిన అధికారులు వాటి వైపు కన్నేత్తి చూడకపోవడం, అక్రమ నిర్మాణాలకు పోత్రహిస్తుండడంతో అనంతరం సమస్యలు వచ్చినప్పుడు మున్సిపల్ కార్యాలయమే సమస్యల పరిష్కారానికి నిధులు వెచ్చించాల్సి వస్తుంది.మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతూ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లే అవుట్లు చేపడుతున్న వారిని అధికారులు నిలువరించకపోవడంతో పాటు భవిష్యత్లో ఆ లేఅవుట్ లకు మున్సిపల్ వ్యయం వెచ్చించాల్సి వస్తున్నా అధికారులు ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ మున్సిపల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read More తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల యందు అసెస్ మెంట్ అక్రీడిటేషన్ కౌన్సిల్ (న్యాక్ )సందర్శన