లక్ష్మాపూర్ లోని ఎల్లమ్మ దేవాలయంలో అర్థరాత్రి చోరి

విలువైన వెండి, బంగారు ఆభరణాల అపహరణ

లక్ష్మాపూర్ లోని ఎల్లమ్మ దేవాలయంలో అర్థరాత్రి చోరి

జయభేరి, సెప్టెంబర్ 10:- గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకు పోయారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో రాత్రి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయానికి తాళం వేసి వెళ్ళారు.

కాగా అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి  అమ్మవారి ముక్కుపుడక, శఠగోపం, పళ్ళెం, కిరీటాలు, పలు వస్తువులు అపహరించుకు పోయారు. ఉదయం పూజారి ఆలయానికి వచ్చేసరికి ఆలయానికి ఉన్న రెండు ప్రధాన ద్వారాల తాళాలు పగులగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి లోనికి వెళ్లి చూడగా అమ్మవారి ఆభరణాలు కనిపించలేదు. దీంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే గ్రామస్తులు పోలిసులకు సమాచారం అందించారు. కాగా చోరికి గురైన అభరణాల విలువ 1,50,000 ఉంటుందని స్థానికులు తెలిపారు.

Read More అండగా ఉంటున్న ఇండస్ట్రీనే అవమానిస్తున్నారు...

IMG-20240910-WA1279IMG-20240910-WA1277

Read More ఇక హైదరాబాద్‌లో ‘డీజే’ చప్పుడు బంద్..!!