పిల్లలమర్రిలో ఘనంగా లక్ష మల్లె పుష్పార్చన

భక్తులతో కిట కిటలాడిన ఆలయ ప్రాంగణం
ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు దరూరి రాఘవా చార్యులు

పిల్లలమర్రిలో ఘనంగా లక్ష మల్లె పుష్పార్చన

జయభేరి, సూర్యాపేట (పిల్లలమర్రి):

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో గురువారం వైభవంగా హనుమాన్ జయంతి త్రయానిక ఉత్సవాలు ప్రారంభం భాగంగా శుక్రవారం ఆలయ అర్చకులు దరూరి వెంకట రాఘవా చార్యులు ఆంజనేయ స్వామికి లక్ష మల్లె పుష్పార్చన ఘనంగా నిర్వహించారు.

Read More తెలంగాణ క్రీడా పాఠశాలలో 2k రన్ విజయవంతం చేయాలి

మల్లెల అలంకరణలో స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ధర్మకర్త గవ్వ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. చారిత్రాత్మక దేవాలయాలు మన పిల్లలమర్రిలో ఉండటం మన గ్రామానికి ఎంతో విశేషమని అతి పురాతన శ్రీ అభయాంజనేయ ఆలయంలో ఘనంగా ఎటువంటి కార్యక్రమాలు లోక రక్షణార్ధం జరపటం ఎంతో పుణ్యం అని పేర్కొన్నారు. లక్ష మల్లె పుష్పార్చన కార్యక్రమానికి దాతలు బ్రహ్మ దేవర సీతయ్య కళావతి దంపతులు సహకరించారని వారికి ఆ స్వామి వారి అనుగ్రహం ఉండాలని తెలియజేశారు.భక్తులు రమా నామ స్మరణ చేస్తూ స్వామిని దర్శించుకున్నరు.

Read More వ్యవసాయ సహకార సంఘం 43 వ సాధారణ సమావేశం

ఈ కార్యక్రమంలో దరూరి సింగారా చార్యులు, చింతాడ రామానుజ చార్యులు, ముడుంభై రఘువరన్ ఆచార్యులు, అబ్బూరి వినోద్ శ్యామల, షేక్ జానిమీయ, సికిర వీరేశం సరస్వతి, దేవరశేట్టి ముకుందం, మనసాని నాగేశ్వరరావు, మహిళ భక్తులు ముడుంభై సారిక, గవ్వ పద్మ,మెరెడ్డి సువర్ణ, దేవరశెట్టి అనసుర్య, మేరెడ్డి సునంద, మల్లీశ్వరి, రేణుక తదితరులు పాల్గొన్నారు.

Read More విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు