Komatireddy : నల్గోండలో సత్తా చాటిన కోమటి బ్రదర్స్

నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఘన విజయం నమోదు చేశారు. ఈయన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 559905 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. రఘువీర్ రెడ్డికి 784337  ఓట్లు పోలయ్యాయి. సైదిరెడ్డికి 224432  ఓట్లు వచ్చాయి. 

Komatireddy : నల్గోండలో సత్తా చాటిన కోమటి బ్రదర్స్

జయభేరి, నల్గోండ, జూన్ 5 : 
నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఘన విజయం నమోదు చేశారు. ఈయన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 559905 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. రఘువీర్ రెడ్డికి 784337  ఓట్లు పోలయ్యాయి. సైదిరెడ్డికి 224432  ఓట్లు వచ్చాయి. 

బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న కంచర్ల క్రిష్ణా రెడ్డికి 218417 ఓట్లు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ ఈ లోక్ సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అయింది. తెలంగాణలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది. మొత్తానికి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జోరు విపరీతంగా ఉంది. ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఏ ప్రభావం లేదు. 

Read More Telangana I పదవి అమ్మది.. పెత్తనం కొడుకుది...

నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘురవీర్ రెడ్డి భారీ ఆధిక్యంలో కొనసాగారు. ఈయనకు ఉదయం 11 గంటల సమయానికి 738400 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 525362 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల క్రిష్ణా రెడ్డి 534796 ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు మూడో స్థానంలోనే ఉంది.

Read More Telangana I జంప్ జిలానీల తో ఎల్బీనగర్ తికమక

రెండో స్థానంలో బీజేపీ
జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ కుమార్ షెట్కార్ ఘన విజయం సాధించారు. ఈయన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ పై 46188 ఓట్ల స్వల్ప మెజారిటీ సాధించారు. సురేష్ కుమార్ షెట్కార్ కు 528418 ఓట్లు పోలయ్యాయి. బీబీ పాటిల్ కు 482230 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న గాలి అనిల్ కుమార్ కు 172078 ఓట్లు మాత్రం వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో మూడో స్థానానికి పరిమితం అయింది. తెలంగాణలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది. 

Read More Love : అమ్మను ప్రేమించలేనోడికి  అమ్మాయి కావాల్సొచ్చిందిరా?

మొత్తానికి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది.తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జోరుగా ఉన్నాయి. జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ కుమార్ షెట్కార్ ముందంజలో మొదటి నుంచి దూసుకుపోయారు. ఉదయం 10.30 గంటల సమయానికి ఈయనకు 330138 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ 16228 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ కుమార్ గాలి 213896  ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తెలంగాణలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపించకపోవడం లేదు. పైగా ప్రతి చోటా మూడో స్థానంలో ఉంటోంది.

Read More Telangana journalist | అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ

Views: 0

Related Posts