RV : ఆర్ వి బాక్స్ క్రికెట్ జోన్ ప్రారంభోత్సవం

  • ముఖ్య అతిథులుగా పాల్గొన్న తుంగతుర్తి రవి, కాంగ్రెస్ నాయకులు

RV : ఆర్ వి బాక్స్ క్రికెట్ జోన్ ప్రారంభోత్సవం

జయభేరి, మేడిపల్లి : 

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మూడో డివిజన్ పరిధిలోని సాయి ప్రియ కాలనీలో ఆర్ వి బాక్స్ క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కుమార్తె, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొని నిర్వహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య నేతలు మాట్లాడుతూ... కాంక్రీట్ జంగల్ గా మారిన నేటి పట్టణాలలో యువకులకు క్రీడా స్థలాలు కరువయ్యాయని, ఇలాంటి బాక్స్ క్రికెట్ స్టేడియాలు యువతకు ఆనందంతో,పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయని, ఔత్సాహిక క్రికెటర్లకు బాక్స్ క్రికెట్ స్టేడియాలు ఎంతో దోహదపడతాయని తుంగతుర్తి రవి తెలుపుతూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

Read More చలో నల్లగొండ  రైతు మహాధర్న కార్యక్రమానికి బయలుదేరిన  చందంపేట మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు

IMG-20240426-WA2672

Read More అంతర్రాష్ట్ర గంజాయి విక్రెతల ముఠా అరెస్ట్... భారీగా గంజాయి స్వాధీనం