Telangana : కొండమల్లేపల్లి లో మాంగల్య ఫంక్షన్ హాల్స్ ప్రారంభోత్సవం
- ముఖ్య అతిథులుగా పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బాలు నాయక్ లకు విష్ణు షాపింగ్ మాల్ మేనేజింగ్ పార్టనర్స్ శాలువాలతో ఘనంగా సన్మానించారు.
జయభేరి, కొండమల్లేపల్లి :
కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని సాగర్ రోడ్ లో గల విష్ణు షాపింగ్ మాల్ మూడో అంతస్తులో మాంగళ్య బాంక్వెట్స్ ఫంక్షన్ హల్స్ నూతన ప్రారంభోత్సవం సందర్బంగా మాంగళ్య బాంక్వెట్స్ ఫంక్షన్ హాల్స్ లో వాస్తు, గణపతి, నవగ్రహ పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతం, శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వేద బ్రాహ్మణోత్తముల కమనీయంగా నిర్వహించి నూతన ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ... కొండమల్లేపల్లి పట్టణంలో షాపింగ్ మాల్స్ ఏర్పాటు కావడంతో పాటు కొండమల్లేపల్లి పట్టణం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం ఎంతో శుభసూచకమన్నారు వివాహాది శుభకార్యాలతో పాటు అన్ని రకాల శుభ కార్యాలకు మాంగళ్య బాంక్వెట్ ఫంక్షన్ హాల్ సెంట్రలైజ్డ్ ఏసీ సౌకర్యంతో ఉద్యోగులకు, వ్యాపారులకు అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందని వినియోగదారులు మాంగళ్య బాంక్వెట్ ఫంక్షన్ హాల్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం మాంగళ్య బాంక్వెట్ ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బాలు నాయక్ లకు విష్ణు షాపింగ్ మాల్ మేనేజింగ్ పార్టనర్స్ శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మేనేజింగ్ పార్టనర్స్ చీదెళ్ల వెంకటేశ్వర్లు, పానుగంటి మల్లయ్య, ఇస్లావత్ దేశిరాం, సముద్రాల జ్ఞానేశ్వర్, వనపర్తి మురళి, దొడ్డి వెంకటేశ్వర్లు, దొడ్డి అశోక్, దొడ్డి సుధాకర్, శీల వెంకటేష్, చీదెళ్ళ మనోజ్ కుమార్, మరియు మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, కేసాని లింగారెడ్డి టీవీయన్ రెడ్డి, మంచి కంటి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్, నీల పాండరయ్య, ఇమ్మడి భద్రయ్య, గోవిందు జగతయ్య, శీల వెంకయ్య ముత్యాల సర్వయ్య,గుద్దేటి జంగయ్య , ఆలంపల్లి ధనయ్య, మిర్యాల శ్రీనివాస్ ఉప్పల శ్రీనివాస్ కర్నాటి శ్రీనివాస్, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.
Post Comment