బోడుప్పల్ లో అక్రమ నిర్మాణాల జోరు...

మున్సిపల్ పర్మిషన్ లేకుండానే నిర్మాణాలు

బోడుప్పల్ లో అక్రమ నిర్మాణాల జోరు...

జయభేరి, మేడిపల్లి : బోడుప్పల్ నగర పరిధిలోని 4వ డివిజన్ అనఘాపురి కాలనీలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. ఎలాంటి మున్సిపల్ పర్మిషన్ లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నా మునిసిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది పట్టించుకున్న దాఖలాలు లేవు. వక్ఫ్ బోర్డు పరిధిలో ఎలాంటి ఇంటి అనుమతులు తీసుకోకుండానే ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. మున్సిపల్ పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణాలు ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నా, మునిసిపల్ అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని, స్థానిక  ప్రజలు గుస గుస లాడుకుంటున్నారు.

ఈ 4వ డివిజన్ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ డివిజన్ కావడం విశేషం. అంతేకాకుండా స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు అందిన కాడికి దండుకుంటూ అక్రమ నిర్మాణాలకు ఊతం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Read More tsrtc I ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్

IMG-20240827-WA3082

Read More Telangan Sand I తెలంగాణ చరిత్ర, జాతి, ఎన్నటికీ క్షమించదు... ప్రకృతి సంపదను కొల్లగొట్టిన గత ప్రభుత్వపు పాలన...

Views: 0