Governor C P Radhakrishnan : లియోనియో రిసార్ట్ లో జాతీయ స్థాయి వీసీల సదస్సు.. హాజరైన గవర్నర్ సిపి రాధాకృష్ణన్
విశ్వవిద్యాలయాలు సాంకేతికను అందిపుచ్చుకుని నయా భారత్ దిశగా అడుగులు వేయాలి - గవర్నర్ రాధాకృష్ణన్
జయభేరి, ఏప్రిల్ 15:
వికసిత్ భారత్ ప్రణాళికలను సాకారం చేసే దిశగా విశ్వవిద్యాలయాలు నిరంతరం కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ ఆకాంక్షించారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం బొమ్మరాశిపేటలోని లియోనియా రిసార్ట్స్ లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటి సంస్థ తన 98వ వార్షిక జనరల్ సమావేశంతో పాటు వర్సిటీల ఉపకులపతులు మూడురోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ మూడు రోజుల సదస్సును ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ విశ్వవిద్యాలయం సహకారంతో నిర్వహిస్తున్నారు. కాగా ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం 78 మంది విద్యావేత్తలు కలిసి రచించిన సష్టయనబుల్ గోల్స్ పుస్తకాన్ని గవర్నర్, విచ్చేసిన అతిథిలు కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ ప్రసంగిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడుతున్న విద్యారంగానికి ఉపకులపతులు చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. దేశంలోని విశ్వవిద్యాలయాలన్ని విద్యార్థుల ప్రతిభకు సానబెట్టి వారిని పోటీ ప్రపంచంలో విజయం సాదించేలా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. దేశంలోని ఉన్నత విద్యకు సంబందించి నిరంతర మార్పులు చేర్పులు చేసేందుకు కృషి చేస్తున్న ఏఐయు సంస్థపై గవర్నర్ ప్రశంసల జల్లు కురిపించారు. అదేవిధంగా ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించ తలపెట్టిన వికసిత్ భారత్ ప్రణాళికను సాధికారం చేసే దిశగా విశ్వవిద్యాలయాలు కృషి చేయాలని కోరారు. ఈ సదస్సులో ఏఐయు ప్రతినిధులు, దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సుమారుగా 500ల మంది పాల్గొన్నారు.
Post Comment