ముఖ్యమంత్రి పెద్దన్న గా చెప్పుకుంటున్న మాజీ MLA సుధీర్ రెడ్డి కక్కుర్తే రేవంత్ రెడ్డి పదవికి గండం - వైయస్సార్
- పర్వతాపూర్ వివాదాస్పద స్థలాలు 2008లోనే కాంగ్రెస్ పాలనలో క్రమబద్ధీకరణకు ఎన్వోసీలు ఇచ్చిన రెవెన్యూ యంత్రాంగం
- ఇప్పుడు సీలింగ్ ల్యాండ్ అంటూ మాజీ MLA సుధీర్ రెడ్డి రాజకీయ వేధింపులు
- కాంగ్రెస్ పార్టీలో చేరాలని కార్పోరేటర్లను ఎంపిక చేసుకొని మరీ కూల్చివేతలు
- కాంగ్రేస్ నాయకుల కొమ్ముకాస్తున్న అధికారులు
- ప్రజాపరిపాలన పేరుతో పేద ప్రజల ఆస్తులను కొల్లగొట్టుతున్న ముఖ్యమంత్రి బంధువులు
- కమీషన్ల కక్కుర్తి గా పేరొందిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ని కట్టడి చేయకపోతే ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి తన గొయ్యిని తానే తొవ్వుకునుడు ఖాయం
మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ లో సర్వే నంబర్ 1 లో పేద ప్రజలకు చెందిన కూల్చివేసిన ఇండ్లను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మున్సిపల్ కార్పోరేషన్ నుంచి అన్ని అనుమతులూ తీసుకున్న ఇండ్లను రెవిన్యూ యంత్రాంగం దారుణంగా కూల్చివేయడం సహించరాని విషయమన్నారు.

పర్వతాపూర్ సర్వే నంబర్ 1లో 30 ఏండ్ల కిందటే ప్లాట్లు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్న వాటిని 2008లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంమే క్రమబద్ధీకరణ చేసిందని సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కి చిత్తశుద్ధి ఉంటే రెవెన్యూ అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడంతోనే మున్సిపల్ పర్మీషన్ తీసుకొని లోన్లు తీసుకుని నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేసిన అధికారులను సస్పెండ్ చేయాలని సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రజా పాలన పేర పేద ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం సామూహిక దాడులకు పాల్పడుతుందనడానికి పర్వతాపూర్ కూల్చివేతలే నిదర్శనమని ఆయన అన్నారు. ఇక రేవంత్ రెడ్డి సర్కార్ మరో ఆరు నెలల్లో ముగింపు పలకడం ఖాయమన్నారు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతి అక్రమాలకు పాల్పడిన వారికి తగిన మూల్యం చెల్లించక తప్పదని సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు.


