ప్రయివేటు విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలి
- మండల విద్యా అధికారులను, భోధన, బోధనేతర సిబ్బందిని వెంటనే నియమించాలి
- నాణ్యమైన విద్యా ప్రమాణాల పెంపుకు లోక్ సత్తా పార్టీ డిమాండ్
జయభేరి, హైదరాబాద్, మే 20 :
నానాటికీ దిగజారి పోతున్న విద్యా ప్రమాణాలను పెంపొందించి విద్యార్థినీ, విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చి దిద్దేలా వచ్చే విద్యా సంవత్సరానికి గాను చేపట్టే ప్రణాలికలను ప్రకటనలతో సరిపెట్టకుండా, మొక్కుబడిగా కాకుండా నాణ్యమైన విద్యా ప్రమాణాలు అందించే విధంగా పటిష్ట కార్యాచరణను ప్రభుత్వం వెంటనే ప్రకటించి అమలుకు శ్రీకారం చుట్టాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు డిమాండ్ చేశారు.
త్వరలో రాష్ట్రంలోని పాఠశాలల పనితీరుపై, తీసుకోవాల్సిన చర్యలపై తగు నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని తుమ్మనపల్లి స్పష్టం చేశారు. విద్యా ప్రమాణాల మెరుగుకు లోక్ సత్తా పార్టీ చేపట్టే కార్యక్రమాల నిర్వహణకు ఒక బృందాన్ని వంశీ ప్రసాద్ కన్వీనర్ గా , సభ్యులుగా శివరామ కృష్ణా, రాజీవ్, శ్యామ్, వరుణ్ లు సేవలు అందిస్తారని సమావేశం పేర్కొంది. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మెట్ల జగన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస వర్మ, కారదర్షులు సరోజాదేవి, మల్లాది కిషోర్, సుబ్రమణ్యం, వేంకటేశ్వర రావు, సాయి తదితరులు పాల్గొన్నారు.
Post Comment