farmers : రైతులు పండించిన వరి ధాన్యంను వెంటనే కొనాలి
మాజీ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం, మోసం చేయడం, దగా చేయడమే అని ఆయన అన్నారు. రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తది అని ఆయన ప్రశ్నించారు.
జయభేరి, దేవరకొండ :
రైతులు పండించిన వరి ధాన్యంను వెంటనే కొనాలని, వడ్లకు రూ.500 ల బోనస్ ఇవ్వాలని అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం దేవరకొండ పట్టణములో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుమేరకు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా మాజీ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం, మోసం చేయడం, దగా చేయడమే అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రెగటి మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీ మాధవరం సునీతజనార్దన్ రావు, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, మండల పార్టీ అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, వేలుగురి వల్లపు రెడ్డి, రమావత్ దసృ నాయక్, లొకసాని తిరుపతయ్య, గాజుల ఆంజనేయులు, నట్వ గిరిధర్, కేసని లింగా రెడ్డి, బొయపల్లి శ్రీనివాస్ గౌడ్, ముక్కమల్ల బాల్లయ్య, నీల రవికుమార్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, రమావత్ రమేష్, కేతవత్ శంకర్,జర్పుల లోక్య నాయక్, రమావత్ తులిసిరము, వింజమూరి రవి, దండేకర్ ప్రసాద్, పొట్ట మదు, నల్ల గాజు సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.


