Elections 2024 I జంపు జిలానీల భరతం పట్టు..
జెండాలు మారిన నేతలకు కర్రు కాల్చి వాత పెట్టు.. రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి! పార్టీలు మారుతున్న నేతలు.. ప్రజలకు తప్పని తిప్పలు..
జయభేరి, హైదరాబాద్ :
సిగ్గు ఎగ్గు లేదు!? మానం మర్యాద అసలు ఉండదు!? ప్రజలు ఏమనుకుంటారో ఆన్న సోయి కూడా పట్టదు. ఏది ఏమైతేనేం, అధికారం మాకు దక్కాలే!? గెలిచే పార్టీ జెండా కప్పుకోవాలే.? చీము, నెత్తురు ఉన్న కాసేపు నాలుకను మడత పెట్టి జై తెలంగాణ అన్న నోర్లు ఇప్పుడు జై భారత మాత, జై మోడీ అంటూ బుద్దిగా పద్ధతిని మార్చుకుంటున్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలో మొన్నటివరకు కేసీఆర్ నేతృత్వంలో పదవులు అనుభవించి, మంత్రిగా మున్సిపల్ చైర్మన్ గా కొలువులు సిగ్గు లేకుండా కులికి ఇవ్వాలా నై కేసీఆర్ అంటూ జై మోడీ పదమెత్తుతున్న అవకాశవాద స్వార్థ రాజకీయ నాయకులను ఏమనాలి!? ఒక మేడ్చల్ నియోజకవర్గం లోనే కాదు వరంగల్ వర్ధన్నపేట రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరూరి రమేష్ బిజెపి తీర్థం పుచ్చుకొని కొత్తగా భారత్ మాతాకీ, వందేమాతరం అంటూ నానా ఇబ్బంది పడుతున్నాడు. కెసిఆర్ సంకన చేరిన ఈ రాక్షస బల్లులే మళ్లీ బిజెపి కండువా కప్పుకుని కునీరాగాలు తీస్తున్నాయి... ఇలాంటీ సమయంలో ప్రజలు జాగ్రత్తగా నిబద్ధతతో నిజాయితీగా ఉండాల్సిన తరుణంఏర్పడుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు అవగాహన కల్పించడం మీడియా బాధ్యత ఎంతైనా ఉంది.
అన్ని గాలికి వదిలేసి అధికారం కోసం ఏ జెండా అయినా కప్పుకునే నీచ నికృష్ట దౌర్భాగ్య అష్ట దరిద్రపు రాజకీయ నాయకుల ఫోటోలకు ఓట్లు వేస్తారో... చెప్పు దెబ్బలు కొడతారో... ప్రజలే ఆలోచించుకోవాలి. నిర్ణయించుకోవాలి నిజాయితీగా ఓటును వినియోగించుకోవాలి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచి జై తెలంగాణ అంటూ కేసిఆర్ సంకన చేరిన వాళ్లు ఇవాళ కెసిఆర్ కు బద్ధ శత్రువులుగా మారి అధికార కాంగ్రెస్ పార్టీలోకి కొందరు వెళుతుంటే మరికొందరు బిజెపి తీర్థం పుచ్చుకోవడానికి ఆలోచించి ఆలోచించి అనేక తప్పులు చేసి,కేసులు భూకబ్జాలు అక్రమ సంపాదన దోచుకున్న వాళ్లంతా బిజెపిలోకి వలస వెళ్తున్నారనే వాదనలు గట్టిగా వినపడుతున్నాయి.
ఇక బిజెపి మతపరమైన రాజకీయ పోకడలు నిర్మించుకుంటుంటే.. ప్రజలు జై భరతమాత, వందేమాతరం అన్న స్లోగన్ కు ఇష్టపడి జై భారతమాత అంటుంటే దేశం మొత్తం బిజెపి ఉంటుంది అన్న సంకేతాలు బలంగా వినపడుతున్నాయి అనుకుంటున్నా బీజేపీ పార్టీకి, గత శాసనసభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయో ఇంకా అర్థం కాకపోతే వారికి మరెవరు చెప్పాలి. అలాగే పది సంవత్సరాలు కేసీఆర్ ను భరించిన తెలంగాణ ప్రజలు చీదరిస్తూ ప్రతిపక్షంలో కూర్చోబెడితే, సిగ్గు లేకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసి కేసీఆర్ సంకన చేరితే దాన్ని ఎలాంటి పొత్తు అనాలి!? ఒకవైపు కేసీఆర్ సంకన చేరిన వాళ్లంతా పదవులు అనుభవించిన వాళ్లంతా బీజేపీలోకి జంపు జిలానీలుగా మారుతుంటే ఇంకోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సరికొత్త రాజకీయానికి తెరలేపుతూ కేసీఆర్ తో జతకట్టి బి ఆర్ ఎస్ పి గా మారిపోయారు. మంచి పధకంతో ప్రవీణ్ కుమార్ రాజకీయ రంగప్రవేశం చేసిన కెసిఆర్ తో జతకట్టిన వాళ్ళ పరిస్థితి నేడు ఏమయ్యిందో ఒక్కసారి ఆయనకెందుకు అర్థం కావట్లేదో ప్రజలకు అర్థం కావట్లేదు. పావురం తాచుపాము కథ ఒక్కసారైనా చదువుకోలేదేమో వీళ్ళు... తాచుపాము చెట్టుపై ఉన్న పావురం తో స్నేహం చేసి పావురం లేని సమయంలో పావురం గుడ్లను తింటున్న తాచుపామును పసిగట్టిన పావురం దాని జీవితం సమాప్తం అయిపోయింది.. అన్నట్టుగా కేసీఆర్ తో జతకట్టిన ప్రతి ఒక్క రాజకీయ నేత పూర్తిగా తనను తాను బలి చేసుకోవాల్సిందే..!? రాజకీయ జీవితం కాదు కదా కనీసం బ్రతకడానికి కూడా బట్టలు ఉండవు! అనేది తెలంగాణ ప్రజలు చెబుతున్న మాట. ఈ మాత్రం ఆర్ఎస్పీకి ఎందుకు అర్థం కావట్లేదో!? ఆయన రాజకీయ విజ్ఞతకే తెలవాలి.
అయినా జంపు జిలానీలు ప్రతి ఒక్క పార్టీలో ఉంటారు. కానీ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో వార్డు మెంబర్ల నుంచి మునిసిపల్ చైర్మన్ ల దాకా రెడ్డి సామాజిక వర్గంలోని నాయకులు పూర్తిగా బిజెపి తీర్థం పుచ్చుకుంటున్నారు. మొన్నటివరకు ఆయా నియోజకవర్గాలలో ఉన్న విలువైన భూములను కాజేసి ఏకంగా అక్రమ భవన నిర్మాణాలను కట్టేసి దోచుకున్న సొమ్ము చెరబట్టిన భూమి దాచుకున్న నగ నటరా ఆస్తి ఇవన్నీ కాపాడుకోవాలంటే మరొకసారి కేంద్రంలో బిజెపి ప్రభుత్వమే వస్తుందంటూ బిజెపిలోకి వెళ్లిన ఈ అవకాశవాద జంపు జిలాని రాజకీయ నాయకులను మేడ్చల్ నియోజకవర్గం ప్రజలు తరిమికొట్టాలి. అలాగే తెలంగాణ జిల్లాల్లోనే ప్రతి ఒక్క జంపు జిలానీలను పసిగట్టి వారిని ఎక్కడికక్కడ ఎండగట్టి ఎంపీ ఎలక్షన్లో జంపు జిలానీలకు కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే! అంటూ తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు.
ఒక మాటలో చెప్పాలంటే రాజకీయ నాయకుడు ప్రతి నియోజకవర్గంలో ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు మాత్రమే మర్యాదగా మాట్లాడుతున్నారు! కానీ ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళ భాష తీరు మారిపోయి, వాళ్ళ ప్రవర్తన పూర్తిగా అహంకారపూరితంగా ఉంటుంది. పోగొట్టుకున్న సొమ్మును ఎలాగైనా రాబట్టుకోవడానికి అడ్డమైన పనులకు శ్రీకారం చుడుతున్నారు.
అందుకని రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి జంపు జిలానిలా భరతం పట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ నుంచి బిజెపికి వెళ్లిన నేతలను రాజకీయ సన్యాసం చేసేలాగా ప్రజలు ఆలోచించుకొని ఓటు వేస్తే ఇంకొకసారి పార్టీ మారాలంటేనే ప్రతి ఒక్కరూ భయపడాలి. అలాగే టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన నేతలను అలాగే కాంగ్రెస్ నుంచి బిజెపికి వెళ్లిన నేతలను ఇలా జంపు జిలానీలను ఎక్కడికి అక్కడ ఏరిపారేసి భరతం పట్టాలి. అయినా రాజ్యాంగం కల్పించిన హక్కు అని మాట్లాడే ఈ రాజకీయ శునకాలు, వ్యభిచారులు... ఇలాంటి వారికి రాజ్యాంగం అనుమతి ఒక రహదారిగా మారిపోయింది. తమ ఇష్టారాజ్యంగా నచ్చిన పార్టీలోకి వెళుతూ ఎల్లకాలం అధికారంలో ఉండాలనే దుర్బుద్ధికి ప్రజలే ఓటు ద్వారా సరైన సమాధానం చెప్పాలి.
చివరిగా మహాప్రస్థానం శ్రీశ్రీ మాటలను మనసా వాచ స్మరించుకుంటూ......
స్మశాన లవంటి నిఘంటువులు దాటి వ్యాకరణాల సంకెళ్లు విడిచి చందస్తుల సర్ప పరిశ్రమంగం వదిలి అహంకారానికి చరమగీతం పాడాలి...
అనాధ జీవులన్నీ సమాధులన్నీ అగోరించి జంపు జిలాని బాగోతాన్ని తూర్పారబడుతుంటే..
స్వర్గ విలయ హేమంత వసంత ద్వాంత కాంతి విక్రాంతి వేళలో...
ఇదేమి కాలం, లోకం హిరణ్య నేత్రుని పద ఘాతమున ప్రతిధ్వనించగా.. ఈ రణరంగ కురుక్షేత్రమున కృద్ధ వృకోదరు గదా ఘాతమున గజగజలాడించాలి....
శ్రీశ్రీ మాటలను ప్రజలందరూ వంట పట్టించుకుని భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ గీతాన్ని నేను స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం ఆనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం అంటూ మన ఓటు హక్కును నిక్కచ్చిగా నిర్లజ్జగా ని సిగ్గుగా లోకాలు భవభూతి శ్లోకాలు పరమేశ్టి జూకాలు నా మహోద్రకాలు...
నా ఊహ ఛాంపవ్య మాల రసరాధ్య డోల నావుల కేదార గౌళ అనే పదాల ఆక్రోవేశాన్ని జీర్ణించుకొని బుద్ధి జీవులమై జంపు జిలానీలకు కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే... జాగోఓ టరా..... జాగో....
...కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
Post Comment