Durgam Cheruvu Cable Bridge : కేబుల్ బ్రిడ్జి ప్రమాదాలపై పోలీసులు సీరియస్
సెల్ఫీలు తీసుకుంటే జరిమానా.. కేసు నమోదు చేస్తామన్నారు...
మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. దీంతో పోలీసులు సీరియస్ అయ్యారు. సెల్ఫీల కోసం కేబుల్ బ్రిడ్జిపైకి వస్తే జరిమానా, కేసు నమోదు చేస్తామన్నారు.
సెల్ఫీల కోసం కేబుల్ బ్రిడ్జిపైకి వస్తే జరిమానా
హిట్ అండ్ రన్ కేసులో చనిపోయిన అనిల్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఆ కారు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మాదాపూర్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి హిట్ అండ్ రన్ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీల కోసం రోడ్డు మధ్యలోకి వెళ్లడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కేబుల్ బ్రిడ్జిని వాహనాల కోసం ఏర్పాటు చేశామని, సెల్ఫీల కోసం కాదన్నారు. ఎవరైనా రోడ్లపై సెల్ఫీలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు దిగితే జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దుర్గంచెరు కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు దిగేందుకు వెళ్లవద్దని మాదాపూర్ సీఐ మల్లేష్ తెలిపారు. కేబుల్ బ్రిడ్జిపై ఎవరైనా ఫొటోలు దిగేందుకు వస్తే రూ.1000 జరిమానా నమోదు చేసి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Post Comment