MLC : కవితకు చుక్కెదురు
3 రోజుల సీబీఐ కస్టడీ
జయభేరి, న్యూఢిల్లీ, ఏప్రిల్ 12
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆమెను 3 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఆమెకు సీబీఐ ఈ నెల 15 వరకూ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకూ కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.దీన్ని వ్యతిరేకిస్తూ.. కవిత కోర్టులో పిటిషన్ వేశారు. కవితను ఇప్పటికే సీబీఐ ప్రశ్నించిందని.. తనను అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడుగుతోందని తెలిపారు. తనను కస్టడీకి ఇవ్వొద్దని కోరారు.ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆమెను గురువారం అరెస్ట్ చేసిన సీబీఐ శుక్రవారం ఉదయం కోర్టులో హాజరుపరిచింది.
అభిషేక్ బోయినపల్లి భారీ ఎత్తున డబ్బు హవాలా రూపంలో చెల్లించారు. ఈ డబ్బును గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్లు సమీకరించినట్లు వాట్సాప్ చాట్ ధృవీకరిస్తోంది.' అని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు కోర్టుకు అందజేశామని పేర్కొంది.కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో కవితను అరెస్ట్ చేశారు. ఆమె కస్టడీని ఇప్పటికే మూడు సార్లు పొడిగించింది కోర్టు. కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఆమె బయటకు రావాలంటే ఈడీ కేసులోనే కాదు సీబీఐ కేసు లోనూ బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.
Post Comment