సి.టైప్ క్వార్టర్స్ లో నివాసముంటున్న నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లును కేటాయించాలి
- ఇండ్లును కేటాయించిన తర్వాతనే క్వార్టర్స్ ను కాళీ చేయించాలి
- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి
జగిత్యాల :
పట్టణంలోని ధరూర్ క్యాంప్ సి.టైప్ క్వార్టర్స్ లో నివాసముంటున్న నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లును వెంటనే కేటాయించాలని కోరుతూ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జీ డాక్టర్. భోగ శ్రావణి, జిల్లా కలెక్టర్ కోరారు..
దీంతో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారని, ఉన్నపలంగా ఖాళీ చేయడం ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.. కావున వారికి కొంత సమయం ఆరు నెలల గడువు ఇవ్వగలరని వారి తరఫున కోరుతున్నామన్నారు. కూలి, నాలి పని చేస్తూ, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న వారు ఈ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారని,తమరు వారిపై దయతలిచి నూక పెళ్లిలో నిర్మాణం చేస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లును వారికి ఇప్పించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసినట్టు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల్ పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, పట్టణ మాజీ అధ్యక్షులు వీరభత్తిని అనిల్ కుమార్,9వ వార్డ్ కంటెస్టెడ్ కౌన్సిలర్ గడ్డల లక్ష్మి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు
Post Comment