Road : పీర్జాదిగూడ - పర్వతాపూర్ రోడ్డు పనులు పూర్తి చేయండి

  • పీర్జాదిగూడ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుల పర్యటన
  • విద్యుత్, డ్రైనేజీ, మంచినీటి సమస్యలతో ప్రజల ఇక్కట్లు
  • సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేసిన తుంగతుర్తి రవి, నాయకులు 

Road : పీర్జాదిగూడ - పర్వతాపూర్ రోడ్డు పనులు పూర్తి చేయండి

జయభేరి, మేడిపల్లి : 

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని పలు డివిజన్ లలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పర్యటించి ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలను, ఎదురవుతున్న సమస్యలను తుంగతుర్తి రవి అడిగి తెలుసుకున్నారు.

Read More Telangana I రాజకీయంలో ఇవన్నీ మామూలే..

IMG-20240516-WA1248

Read More College I సాంకేతికతతో భోధన చేయాలి

ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ రాబోయే వర్షా కాలం దృష్ట్యా ముందస్తు చర్యల కొరకు కార్పొరేషన్ ఏఈతో డ్రైనేజీలు, నూతన డ్రైనేజి ల నిర్మాణం, ఎలక్టికల్ ఏఈతో కరెంట్ స్థంబాల రీప్లేస్ మెంట్, తదితర అంశాలతో పాటు పీర్జాదిగూడ -పర్వతపూర్ కమాన్ రోడ్ విస్తరణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలను ట్రాఫిక్ సమస్య ల నుండి విముక్తులను చేయాలనీ, వర్షాకాలంలో కాలనీలలోకి వచ్చే వరద నీరు నిల్వకుండా డ్రైనేజీ లు, నాలాలను పునరుద్దరించాలని, గతంలో జరిగిన వరద ముంపు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని, ఈ వేసవికాలంలో ప్రజలకు మెరుగైన మంచినీటి సౌకర్యం కల్పించాలని, ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తుంగతుర్తి రవి విన్నపించారు.

Read More Love : అమ్మను ప్రేమించలేనోడికి  అమ్మాయి కావాల్సొచ్చిందిరా?

IMG-20240516-WA1247

Read More Auto I షౌకత్ గ్యారేజ్

ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు చంద్ర రెడ్డి, అంజిరెడ్డి, బోడిగె కృష్ణ గౌడ్, యాసరం మహేష్, అలవాల దేవేందర్ గౌడ్, కో ఆప్షన్ మెంబర్ జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేందర్ రెడ్డి,బండి శ్రీను, చెరుకు మహేష్, పవన్ గౌడ్, మోహన్, సుదర్శన్ రెడ్డి, ఎన్ ఎన్ కే దుర్గ, రవీందర్ రెడ్డి,కరుణాకర్ రెడ్డి,రవి యాదవ్,విక్రమ్ గౌడ్, శ్రీకాంత్ పటేల్, కర్రే రాజు, శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు.

Read More Telangana I ఇది గౌడలను అవమానించడమే..!

Views: 1

Related Posts