ఉద్దేమర్రి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం

హక్కుల సాధన పై అవగహన కల్పించిన అధికారులు

ఉద్దేమర్రి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం

జయభేరి, సెప్టెంబర్ 30 :
ప్రతి పౌరుడు హక్కుల సాధన కోసం పాటు పడాలని ముడుచింతలపల్లి మండల తహసీల్దార్ వెంకటనర్సింహారెడ్డి తెలిపారు. మండలం లోని ఉద్దేమర్రి. గ్రామంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. 

ఈ సందర్భంగా డిప్యూటి తహశీల్దార్ నాగజ్యోతి మాట్లాడుతూ దేశంలోని ప్రతీ పౌరుడు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇక కొన్ని ప్రాంతాలలో కుల వివక్ష కొనసాగుతుందని, దానిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిదంగా హక్కుల సాధన దిశగా అందరూ అడుగులు వేయాలన్నారు, ఈ కార్యక్రమం లో కార్యదర్శి మోహన్ సింగ్, ఆర్ ఐ సరస్వతి, గ్రామపంచాయతీ సిబ్బంది,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Read More ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి....

WhatsApp Image 2024-09-30 at 21.37.35 (1)

Read More దేవి శరన్నవరాత్రి ప్రత్యేక పూజలు