10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు నగదు పురస్కారాలు

విద్యార్ధులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి - ఫౌండేషన్ సభ్యులు వినోద్ కుకునూర్

10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు నగదు పురస్కారాలు

జయభేరి, జులై 24: మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ లోని ఉన్నత పాఠశాలలో కెవిన్ ఫ్రెండ్లీ ఫౌండేషన్ యుఎస్ఎ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు నగదు పురస్కారాలు, మరియు మెమొంటోలను అందచేశారు.

ఫౌండేషన్ సభ్యులు అయిన వినోద్ కుకునూర్ మరియు కవిత ఆధ్వర్యంలో కీర్తి శేషులు బ్రహ్మశ్రీ కుకునూరు కాళిదాస్ స్మారకార్ధం 10వ తరగతి పరీక్షల్లో  ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్ధులకు మొదటి బహుమతి కింద 20 వేల నగదు పురస్కారం, ద్వితీయ బహుమతి కింద 10 వేల రూపాయలు, తృతీయ బహుమతి కింద 5 వేల రూపాయలు నగదు పురస్కారంతో పాటు ప్రశంసపత్రం, మెమోంటో ను అందచేసి అభినందించారు. అనంతరం విద్యార్ధుల పురోభివృద్ధికి పాటు పడుతున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు వినోద్ కుకునూర్ మాట్లడుతూ తాను ఇదే పాఠశాలలో విద్యనభ్యసించానని గుర్తు చేశారు. విద్యార్ధులు కష్ట పడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.

Read More ఇన్ని సంవత్సరాలకు గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది...

be53dc98-cfa3-4fb3-9ae3-88fcab0b0cdf

Read More బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కోఆర్డినేటర్ గా గోర శ్యాంసుందర్ గౌడ్.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు  బాలెష,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్  మీనా,  వినోద్ కుక్కునూరు గారి సోదరులు అశోక్ కుకునూరు , సోదరి రమాదేవి కుక్కునూరు, కుటుంబ సభ్యులు డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య , ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీ ఫయాజ్  స్థానిక ప్రజాప్రతినిధులు నర్సింగ్ రావు,  కౌన్సిలర్ , మహిపాల్ రెడ్డి, సుధాకర్  మరియు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గోన్నారు.

Read More చలో నల్లగొండ  రైతు మహాధర్న కార్యక్రమానికి బయలుదేరిన  చందంపేట మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి