BRS MP AND MLA Joined Congress I కాంగ్రెస్ లో చేరిన బీఆర్ ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే.. కేసీఆర్ కు వరుస షాక్ లు
ఓ వైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కుమార్తె కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు పార్టీ సీనియర్ నేతలు బీఆర్‌ఎస్‌ను వీడుతున్నారు.
జయభేరి, హైదరాబాద్:
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఓ వైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కుమార్తె కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు పార్టీ సీనియర్ నేతలు బీఆర్‌ఎస్‌ను వీడుతున్నారు. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల బీఆర్‌ఎస్‌ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేదంర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఇద్దరు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డే..?
చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ముందుగా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా.. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఆ పార్టీ ప్రకటించింది. రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి చేవెళ్ల సునీతారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే చర్చ సాగింది. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలతో సునీతారెడ్డికి మల్కాజిగిరి టికెట్ ఇచ్చి రంజిత్‌రెడ్డిని చేవెళ్ల నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది.
‘దానం’గా చేరారు..!
రంజిత్ రెడ్డితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు. 2018లో బీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. ఇటీవలే పార్టీని వీడి హస్తం గూటికి చేరుకున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని చెప్పిన దానం.. మెల్లగా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దానం సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Post Comment