కేంద్రంలో బీజేపీదే అధికారం

గుండ్లపోచంపల్లిలో ఈటల రాజేందర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం

కేంద్రంలో బీజేపీదే అధికారం

జయభేరి, మేడ్చల్ :
కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ళ విక్రమ్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 13వ వార్డులో గడప గడపకు బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి హాజరై మల్కాజిగిరి బీజేపీ ఎంపి అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు.

ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ 13 నుంచి 14 సీట్లు కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారతదేశ ప్రజలు మోదీ వైపే చూస్తున్నారని దేశ ప్రధానిగా ప్రజలకు నీతివంతమైన పాలన అందించిన నరేంద్ర మోడీని ప్రజలు మరోసారి ప్రధానిగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మల్కాజిగిరి ఎంపి అభ్యర్థి ఈటల రాజేందర్ పట్ల ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని గతంలో ఈటల ప్రజలకు చేసిన సేవలు ఆయన గెలుపుకు దోహదపడతాయని విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.

Read More Election Bonds I సుప్రీం ఆదేశం.. ఎన్నికల బాండ్లు బయట పెట్టాల్సిందే..

22e07202-a7ae-4556-b979-52b1cbdee467

Read More Telangana I తుంగతుర్తి గడ్డపై ఎగరబోయే జెండా..!?

ఈ కార్యక్రమంలో మేడ్చల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు అమరం సరస్వతి (సెన్సార్ బోర్డ్ మెంబర్), సముద్రాల హంస రాణి, దొడ్ల మల్లికార్జున్, సీనియర్ నాయకులు సముద్రాల కృష్ణ గౌడ్, మండల రవీందర్ గౌడ్, సార కిషన్, బండారి సురేందర్, సార కృష్ణ, తప్పటి హనుమంతు, బట్టికాడి నవనీత, సుంకు నవీన్, బట్టికాడి విక్రమ్, పిడుగుల నాగరాజు, బండారి నరేష్, అరుణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More Congress I రగులుతున్న రాజకీయం.. మంట పెట్టే వారెవరు!?

Views: 0

Related Posts