Bjp Bandi Sanjay : నన్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కు

ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టండి... దేశమంతా మోదీ గాలి వీస్తోంది... మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ మధ్యే ఎన్నికల వార్

Bjp Bandi Sanjay : నన్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కు
  • రాష్ట్రంలో ఖజానా ఖాళీ…. జీతాలకు డబ్బులిచ్చే పరిస్థితి లేదు
  • బీజేపీ ఎంపీలను గెలిపిస్తేనే తెలంగాణకు అత్యధిక నిధులు తీసుకొచ్చే అవకాశం
  • జాయినింగ్స్ పై ప్రత్యేక ద్రుష్టి పెట్టండి
  • కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్

‘‘పార్లమెంట్ ఎన్నికల్లో ఏ సర్వే చూసినా కరీంనగర్ లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని నివేదికలొస్తున్నయ్. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కై నన్ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నయ్. స్థానిక సమస్యలపైన ప్రత్యేక ద్రుష్టి సారించడంతోపాటు వాటి పరిష్కారంలో గత బీఆర్ఎస్ తోపాటు నేటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ పార్టీ నేతలను కోరారు. నరేంద్రమోదీ వర్సెస్ రాహుల్ గాంధీ గా పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని… ఇదే అంశాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని కోరారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండలాల ఇంఛార్జీలతో బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిది సీహెచ్.విఠల్, జిల్లా ఇంఛార్జీ మీసాల చంద్రయ్య, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. అన్ని సర్వే నివేదికలు ఇవే చెబుతున్నాయి.  బీజేపీ గెలుపులో ప్రధాన భూమిక మీదే. పోలింగ్ నాటికి ప్రతి ఓటర్ ను 7 సార్లు కలవాలి. పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ద్రుష్టి సారించాలి.

Read More కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం

dc-Cover-bt4bj3uar1tbnqe5nqejvtv1t5-20220418070019.Medi

Read More పదవి ఉన్న లేకున్నా కార్యకర్తలకు అండగా నిలబడతా

కరీంనగర్ లో సర్వే చేస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈసారి బీజేపీ గెలవాలని కోరుకుంటోంది. ఎందుకంటే కేంద్రంలో మోదీయే ఉండాలని భావిస్తున్నారు. దీనికితోడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రోడ్ల నిర్మాణాానికి అత్యధిక నిధులు తెచ్చింది నేనే. ఈ విషయాన్ని ప్రజల్లో చర్చ ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే… రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఖజానా ఖాళీ అయ్యింది. ఎన్నికల తరువాత ఉద్యోగులకు జీతాలివ్వడమే గగనం కాబోతోంది. అప్పులకు వడ్డీ కట్టే పరిస్థితి లేదు. వీటితోపాటు ఎన్నికల హామీలు అమలు పెద్ద ఎత్తున నిధులు చాలా అవసరం. మోదీ ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే తెలంగాణకు అవసరమైన నిధులు రాబట్టుకునే అవకాశం ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ముఖ్యంగా 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాలను ఊరూరా ప్రస్తావించండి….బండి సంజయ్ ను గెలిపించాక మీ కోసం కొట్లాడిండు… వందల కేసులు పెట్టినా, జైలుకు పోయినా వెరవలేదు… పోరాడిండు… బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాలనుకున్నడు… కానీ దురద్రుష్టవశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

Read More హరీష్ రావు పై అక్రమ కేసులు తగవు

ఈసారి సంజయ్ ను భారీ మెజారిటీతో గెలిపించి పోరాడే నాయకులకు అండగా ఉంటామనే సంకేతాలను పంపాలని కోరండి. ఈ విషయంపై ఇంటింటికీ ప్రచారం చేసేలా వాతావరణం ఏర్పరచండి… జాయినింగ్స్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలి…. బూత్ కమిటీలను పటిష్టం చేయాలి. పన్నా ప్రముఖ్ లను పూర్తిస్థాయిలో రంగంలోకి దించాలి. స్థానిక సమస్యల పరిష్కారంలో గత బీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలి… కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమక్కు రాజకీయాలను ప్రస్తావించాలి. పొన్నం, కేటీఆర్ ఒక్కటే. బండి సంజయ్ ను ఓడించడానికి ఇద్దరూ కలిసి కుట్రలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించాలని అన్నారు.

Read More వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి