బోధిసత్వ మహా బుద్ధ గౌతమ బుద్ధుని జయంతి

బోధిసత్వ మహా బుద్ధ గౌతమ బుద్ధుని జయంతి

జయభేరి :
బుద్ధ జయంతి సందర్భంగా అభిషేక్ హాస్పిటల్ ఆవరణలోని బుద్ధవిహార్ లో బుద్ధ విగ్రహానికి పూలు పూలమాల అలంకరణతో జయంతి వేడుకలు 
కార్యక్రమంలో పాల్గొన్న టెలిఫోన్ వెంకటయ్య మరియు ఎం జనార్ధన్, హాస్పిటల్ సిబ్బంది.

ప్రపంచంలో 2500 సంవత్సరాల క్రితం నేడు నేపాల్ గా పిలవబడుతున్న హిమాలయ పర్వత సానువులకు దగ్గర షాక్యులనే తెగవారు నివసించేవారు. వారి రాజధాని కపిలవస్తునగరం. మహారాణి మాయాదేవి లుంబిని వనంలో బుద్ధునికి జన్మనివ్వడం జరిగింది. గౌతమ బుద్ధుడు వైశాఖ పౌర్ణమి  నాడే జన్మించినాడు అలాగే వైశాఖ పౌర్ణమి నాడే గౌతమ బుద్ధునిగా మారారు అలాగే వైశాఖ పౌర్ణమి నాడే బుద్ధుని నిర్యాణం జరిగినది. అందుకే ఆ పౌర్ణమికి వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి అని పేరు వచ్చిందని ఎం జనార్ధన్ టెలిఫోన్ వెంకటయ్యలు తెలియజేశారు.

Read More నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి 

గౌతమ బుద్ధుని బోధనలను అనుసరించే మన రాజ్యాంగంలోని పీఠికలోని అనేక అంశాలను బాబా సాహెబ్ అంబేద్కర్ పేర్కొన్నారు. అశోకుని ధర్మచక్రం అనేటువంటి మన జెండాలోని ధర్మచక్రాన్ని మనం మన జెండా లో ఏర్పాటు చేసుకున్నాం. ఈ భారతదేశంలో గౌతమ బుద్ధుని యొక్క బోధనలు అనేకమంది ఆచరిస్తుండడం గమనా హార్వం. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ పృథ్వి, ఫార్మసిస్ట్ పద్మశ్రీ, ఆపరేషన్ థియేటర్ ఇన్చార్జ్ తిరుపతి నాయక్ సంగీత తదితరులు పాల్గొన్నారు.

Read More కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న మేడ్చల్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్