గద్దర్ పై బండి సంజయ్ చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తున్నాం 

బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్),అంబేద్కర్ విద్యార్థి సమాఖ్య (ఏ బి ఎస్ ఎఫ్) అంబేద్కర్ యువజన సంఘం(AYC )

గద్దర్ పై బండి సంజయ్ చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తున్నాం 

జయభేరి, శాయంపేట : 
కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ప్రజా యుద్ధ నౌక గద్దరన్న పై చేసిన వాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని  గద్దర్ కు క్షమాపణ చెప్పాలని బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్)ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్, ABSF,AYC సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మొగ్గం సుమన్ మాట్లాడుతూ గద్దర్ ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలైన బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పోరాటం చేశారని అన్నారు.గద్దర్ తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేశారని, తన సొంత లాభం కోసం తన కుటుంబం కోసం ఎప్పుడు జీవించలేదని తెలిపారు.గద్దర్ అంటేనే ప్రతి పేదవాడి గుండె చప్పుడు అని, సమాజంలో అణచివేతకు గురైన వారి గుండెలో చిరస్థాయిగా నిలుస్తాడని ఈ సందర్భంగా అన్నారు. 

బండి సంజయ్ బిజెపి ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలు చేసుకుంటూ ప్రజలలో కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతూ పరిపాలన చేయడం సిగ్గుచేటు అని బిజెపి ప్రభుత్వాన్ని దుయ్యపట్టారు. గద్దర్ కు ఇలాంటి అవార్డులు,రివార్డులు తన కాలుగోటికి సరిపోవు అని తెలిపారు.బండి సంజయ్ గద్దర్ ను విమర్శించే స్థాయి నీకు లేదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గద్దరన్న చేసిన త్యాగం గురించి నువ్వు తెలుసుకోవాలి అన్నారు.నిస్వార్ధంగా బ్రతుకుతూ సమ సమాజ స్థాపన కోసం గద్దరన్న ఎంతో కృషి చేశాడని అన్నారు.బండి సంజయ్ గద్దర్ కు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.లేనియెడల సమాజంలో ఉన్న మెజారిటీ ప్రజలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ఏకం చేసుకొని ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

Read More తీన్మార్ మల్లన్నకు గిరిజన సంక్షేమ సంఘం మద్దతు

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విద్యార్థి సమాఖ్య (ఏ బి ఎస్ ఎఫ్) హనుమకొండ జిల్లా నాయకులు నాలికే ప్రతాప్, బహుజన నాయకులు బోల్లెపేల్లి ప్రసాద్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కొంగర విజయ ప్రకాష్, కార్యదర్శి నాలిక శ్రీకాంత్, నరేష్,BSS నాయకులు మొగ్గం రాజు, తదితరులు పాల్గొన్నారు.

Read More క్యాన్సర్ నిర్మూలన ధ్యేయంగా సత్యసాయి సేవా సమితి...

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి