Lok Sabha : లోకసభ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష
ఎన్నికల సంఘం చే నియమించబడిన ఇద్దరు అబ్జర్వర్లు బండారి స్వాగత్ రణవీర్ చంద్, రాజేష్ కుమార్ కౌంటింగ్ ప్రక్రియలను పరిశీలిస్తారని తెలిపారు. కౌంటింగ్ కోసం మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సిఐపిఎఫ్ భద్రతా సిబ్బందితో పాటు స్టేట్ సాయుధ సిబ్బంది, ఎఆర్ ఫోర్స్, సివిల్ ఫోర్స్ ఉంటుందని, అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంటుందని, పాస్ లేకుండా ఎవరూ అనుమతించబడదు అని తెలిపారు.
జయభేరి, వరంగల్ :
వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గ కౌంటింగ్ కోరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు.
ఎన్నికల సంఘం చే నియమించబడిన ఇద్దరు అబ్జర్వర్లు బండారి స్వాగత్ రణవీర్ చంద్, రాజేష్ కుమార్ కౌంటింగ్ ప్రక్రియలను పరిశీలిస్తారని తెలిపారు. కౌంటింగ్ కోసం మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సిఐపిఎఫ్ భద్రతా సిబ్బందితో పాటు స్టేట్ సాయుధ సిబ్బంది, ఎఆర్ ఫోర్స్, సివిల్ ఫోర్స్ ఉంటుందని, అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంటుందని, పాస్ లేకుండా ఎవరూ అనుమతించబడదు అని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం పరిథిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలియచేస్తూ కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు.
Post Comment