మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ !

షామీర్ పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్‌ లో నిర్మించిన ప్రహరీ గోడ ను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జేసీబీల సాయంతో చెరువులో నిర్మించిన ప్రహరీ గోడలను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ !

జయభేరి, మేడ్చల్ : 
BRS నేత మాజీ మంత్రి మల్లారెడ్డి కి మరో షాక్  తగిలింది. బొమ్రాసిపేట్.. షామీర్ పేట్ మండలంలోని పెద్ద చెరువు ఎఫ్టీఎల్‌ లో నిర్మించిన ప్రహరీ గోడ ను అధికారులు  కూల్చివేశారు. 

బొమ్రాసిపేట్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్‌ లో నిర్మించిన ప్రహరీ గోడ ను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జేసీబీల సాయంతో చెరువులో నిర్మించిన ప్రహరీ గోడలను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. పెద్ద చెరువు ఎఫ్టీఎల్‌లో ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూల్చివేశారు.

Read More Health I ప్రజా ఆరోగ్యం మెరుగుపడేదెలా!?

కాగా నగర శివార్లలోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలో సర్వేనంబరు 82, 83లలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య నెలకొన్న భూ వివాదం తెలిసిందే. అయితే రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదని మరో 15 మంది చెబుతున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం సర్వే నెం.82లోని స్థలంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడుకు.. మరో 15మంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Read More Congress I లెక్కలు తేల్చాల్సిందే...

మల్లారెడ్డి బీఆర్ఎస్‌ పార్టీలో 2016లో చేరిన తర్వాత మా పార్టీషన్ తీసేసి మాపైన కేసు పెట్టించాడు. అప్పుడు పోలీసులను ఆశ్రయిస్తే కోర్టుకు వెళ్లమ్మన్నారు. కోర్టు నుంచి ‘‘నాట్ టు ఇంటర్ ఫియర్’’ అనే ఆర్డర్ తీసుకొచ్చాం. కోర్ట్ ఆర్డర్ ఉన్నా... అప్పట్లో మాకు న్యాయం జరగలేదు. రీసెంట్‌గా మా డాక్యుమెంట్లు, కోర్టు ఆర్డర్ తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్లాం. మాకు సరైన డాక్యుమెంట్లు ఉన్నాయి కాబట్టి మా ల్యాండ్‌లోకి మమ్మల్ని వెళ్లమని పోలీసులు చెప్పారు. దీంతో మా భూమిలోకి వెళ్లి మేము బ్లూ షీట్స్ వేసుకున్నాం

Read More Anganwadi I అద్దె భ‌వ‌నాల్లోనే అంగ‌న్‌వాడీలు

Views: 0