పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీలో చేరిన అజ్జు...
నేషనల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీవీ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ,జాయింట్ సెక్రటరీ, తెలంగాణ ఇంచార్జ్ సయ్యద్ ఖాళీద్ అహ్మద్, MLC తీన్మార్ మల్లన్న, టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి వజ్రెష్ యాదవ్, మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుదీర్ రెడ్డి ఆధ్వర్యంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీలో చేరిన అజ్జు.

ఈ సందర్భంగా వజ్రెష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీలో చేరిన అజ్జుకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, విధానాలు పాటించి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మజర్, మహేశ్వరప్ప, ఉపేందర్, మాధవ్, విజయ్, అస్లాం, వేణుమాధవ్, బంటి, బన్ను, శివ, చరణ్ తదితరులు పాల్గొన్నారు.



